Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేటి బహిరంగ సభను జయప్రదం చేయండి
- సీపీఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్
నవతెలంగాణ-మహబూబాబాద్
దేశంలో సంక్షేమం మతసామరస్యం, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, ప్రమాదంలో పడిందని వాటిని పరిరక్షించుకోవాలంటే బీజేపీని ఓడించడమే లక్ష్య మని సీపీఎం నిర్వహించే ప్రజా జనచైతన్య యాత్రను విజయవంతం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్ పిలుపు నిచ్చారు. జన చైతన్య యాత్ర సందర్భంగా శ్రీనివాస్ 'నవతెలంగాణ'కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. దేశంలో అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం ఫాసిస్టు విధానాలను అవలంభిస్తుందని, మతోన్మాదాన్ని పెంచి పోషిస్తుందని, ప్రజలకు, తెలంగాణకు ఇచ్చిన హామీలను విస్మరించిందని అన్నారు.తెలంగాణ విభజన హామీలైన బయ్యారం ఉక్కు పరిశ్రమ ను నిర్మించడంలో పూర్తిగా విఫలం చెందిందని అన్నారు. వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటులో నిర్లక్ష్యంగా వహించడంతో అది వేరే ప్రాంతానికి తరలిపోయిందన్నా రు. గిరిజన యూనివర్సిటీ ఊసే లేదన్నారు. గిరిజనులకు పోడు భూముల హక్కు లు కల్పించడంలో పాలకవర్గాలు పూర్తిగా విఫలమయ్యాయి అని అన్నారు. జిల్లా వ్యాప్తంగా గుడిసెలు వేసుకున్న పేదలందరికీ ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇవ్వాలని ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూములు పేదలు వేసుకు న్న గుడిసెలను అధికార యంత్రంగా కూల్చివేసే చర్యలను వెంటనే నిలిపివేయా లని హెచ్చరించారు. జిల్లాకు అతిపెద్ద సాగునీటి వనరుగా ఉన్న బయ్యారం చెరు వు నువ్వు మరమ్మతు చేయాలని, ఆధునీకరించాలని డిమాండ్ చేశారు.జిల్లా వ్యా ప్తంగా కోతులు, కుక్కలు బెడద తీవ్రంగా ఉందని ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుం డా పోయిందని వెంటనే వాటిని నిర్మూలించడానికి కార్యచరణ ప్రణాళిక రూపొం దించాలని కోరారు. రైతులు వేసుకున్న పంటలకు రక్షణ లేకుం డా పోయిందన్నారు. ధరణి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యచరణ రూపొం దించాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా మిషన్ భగీరథ నిర్మాణం పైపులైను పనులు పూర్తిచేయాలని ఇంటింటికి మిషన్ భగీరథ స్వచ్ఛమైన తాగునీరు ఇవ్వాలని కోరారు. మానుకోట పట్టణంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి రింగ్ రోడ్డుకు రూపకల్పన చేయాలని కోరారు.
అలాగే ఏ క్యాబిన్ వైపు సిగల్ కాలనీ వద్ద మంజూరైన రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులను వెంటనే చేపట్టాలని కోరారు. నిరుద్యోగ యువతకు రాయితీపై రుణాలు ఇవ్వాలని యూనిట్లు ఏర్పాటు చేయాలని కోరారు. జిల్లా కేంద్రంలో ఓపెన్ ఆడిటో రియం, ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేయాలని కోరారు. జిల్లాలో తొర్రూర్ నుంచి గార్ల వరకు మంజూరైన 930 నెంబర్ జాతీయ రహదారి పనులు వెంటనే చేప ట్టాలని కోరారు. మహబూబాబాద్,కేసముద్రంమార్కెట్లను విస్తరించాలని, తొర్రూ రు, డోర్నకల్లో మార్కెట్లు ఏర్పాటు చేసి పంట ఉత్పత్తులు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న గ్రానైట్ ఖనిజాలను సద్వినియోగం చేసు కొని భారీ పరిశ్రమలు నిర్మించినట్లయితే యువతకు ఉపాధి దొరుకుతుందని అ న్నారు.జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యచరణ ప్రకటించాలని మహబూ బాబాద్లో శుక్రవారం సాయంత్రం తాసిల్దార్ సెంటర్లో నిర్వహించే జన చైతన్య బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరారు.