Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరంగల్ జిల్లా జెడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి
నవతెలంగాణ-శాయంపేట
ప్రతి ఒక్కరికి కంటి చూపు సరిగా ఉండాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని అంధత్వ రహిత తెలంగాణగా తీర్చిది ద్దడమే సీఎంలక్ష్యమని వరంగల్ జెడ్పీ చైర్పర్సన్ గండ్రజ్యోతిఅన్నారు. మండలం లోని పత్తిపాకలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెండో విడత కంటివెలుగు శిబిరాన్ని గురువారం ఆమె సందర్శించి పరిశీలించారు. ఇప్ప టివరకు ఎంతమందికి కంటి పరీక్షలు నిర్వహించారని పీహెచ్సీ వైద్యాధికారి సా యికృష్ణను అడిగి తెలుసుకున్నారు. కంటి వెలుగు పురోగతి గూర్చి వైద్యులతో చ ర్చించారు. గ్రామంలో 1230 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా, 400 మం దికి ఉచిత కళ్లద్దాలు పంపిణీ చేయడం జరిగిందని వైద్య సిబ్బంది తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని మిగతా రాష్ట్రాల కూడా అమలు చేసే యోచనలో ఉన్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విద్య, వైద్య రంగానికి పెద్ద పీట వేస్తున్నారని, అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారని కొనియాడారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి, స్థానిక సర్పంచ్ చిట్టిరెడ్డి రాజిరెడ్డి, ఎంపీడీవో ఆమంచ కష్ణమూర్తి, నాయకులు చిట్టిరెడ్డి జైపాల్ రెడ్డి, పసుల ప్రవీణ్, పెండల కిరణ్ పాల్గొన్నారు.
మృతురాలి కుటుంబానికి పరామర్శ
మండలంలోని పత్తిపాక గ్రామానికి చెందిన న్యూస్ 10 ఎడిటర్ చెన్నా రామకృష్ణ తల్లి శకుంతల అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం రాత్రి మృతి చెందగా బాధిత కుటుంబాన్ని గురువారం వరంగల్ జిల్లా జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, తెలంగాణ రైతు రుణ విమోచన కమిషన్ చైర్మన్ నాగూర్ల వెంకటేశ్వరరావు సందర్శించి భౌతికకాయానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యు లకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వారి వెంట ఎంపీపీ మెతుకు తిరుపతి రెడ్డి, సర్పంచ్ చిట్టిరెడ్డి రాజిరెడ్డి, నాయకులు ప్రవీణ్, జైపాల్ రెడ్డి, శ్యాంసుందర్ రెడ్డి, కిరణ్ పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ
మండల పరిధిలోని గ్రామాలలో 9 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.2 00,500 సీఎంఆర్ఎఫ్ చెక్కులను గురువారం జడ్పీ చైర్పర్సన్ జ్యోతి లబ్ధిదారుల ఇంటికి నేరుగా వెళ్లి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిరుపేదలు కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్య చికిత్సలు చేయించుకున్నప్పటికీ వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆదుకుంటున్నట్లు తెలిపా రు. ఆమె వెంట ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి, వైస్ ఎంపీపీ రామ్ శెట్టి లతా లక్ష్మారెడ్డి, పిఎసిఎస్ వైస్ చైర్మన్ దూదిపాల తిరుపతిరెడ్డి, సర్పంచులు అరికిళ్ల ప్రసాద్, పోతుసుమలత రమణారెడ్డి, పొడమేకల మమతా సంపత్, అబ్బు ప్రకాష్ రెడ్డి, బొమ్మకంటి సాంబయ్య, చిట్టిరెడ్డి రాజిరెడ్డి, ముక్కెర అనూష ప్రేమ్ సాగర్, ఎంపీటీసీలు వావీలాల వేణుగోపాల ప్రసాద్, నాయకులు పాల్గొన్నారు.