Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాత్రికి రాత్రే డంపింగ్.. టిప్పర్లలో పట్టణానికి తరలింపు
- మొరం మాఫియా వాహనాలతో హడలిపోతున్న ప్రజలు
- టెక్స్ టైల్ పార్క్ అనుమతి సాకుతో యధేచ్ఛగా మొరం రవాణా
నవతెలంగాణ-సంగెం
మండలంలో యధేచ్ఛగా మొరం దందా సాగుతున్నా అధికారగణం చూసి చూడనట్టు, మాకేంతెల్వదుఅన్నచందంగా, దందాచేసే వ్యక్తులకు కొమ్ముకాస్తు న్నా రని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఒకటి కాదు రెండు కాదు పదులసంఖ్యలో టి ప్పర్లలో పగలు, రాత్రి మొరాన్ని తరలిస్తూనే ఉన్నారు. అన్నిశాఖల అధికారులు కం డ్లకు కట్టినట్టు చూస్తున్న చూసి చూడనట్టు అసలేం జరుగుతుందో తెల్వనట్టు దళా రులకు కొమ్ముకాస్తున్నారు. చేసినపాపం తలో పిడికెడు అన్నట్టుగా వచ్చిన లా భాల్లో అదే మాదిరిగా వాటాలు ఉన్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. మండల పరి ధిలోని ఎస్సారెస్పీ కాకతీయకాలువ వెంకటాపూర్ శివారు నుండి మొదలై తీగరా జుపల్లి గ్రామం వరకు ఉంది. కానీ కాలువ వెంట రెండు వైపులా గుట్టలుగా పోసి ఉన్న మొరం ఎక్కడ కనిపించే పరిస్థితి లేదు. ఎక్కడికక్కడే టిప్పర్లతో మొరాన్ని కొందరు పట్టణాలకు తరలిస్తుంటే మరికొందరు ప్రైవేటు వ్యక్తుల భూముల్లో డం పింగ్ చేసి, ఒకటిప్పర్ మొరం రూ.10వేల నుండి రూ.15 వేలకు అమ్ముతున్నా రని ఆరోపణలు ఉన్నాయి. ఇంతింతై వటుడింతై అన్నచందంగా ట్రాక్టర్ల ద్వారా ప్రారంభమైన దందా ఇప్పుడు ఎడతెరిపి లేకుండా టిప్పర్లతో రవాణా సాగుతుంది. టిప్పర్ల రవాణాతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి వేళలో మండలంలోని రహదారులలో ఎటు చూసినా మాఫియా మొరం దందా వాహనా లు హోరెత్తిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి.
టెక్స్టైల్ పార్కు రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఎస్సారెస్పీ కాకతీయ కాలువ నుండి ఓ కాంట్రాక్టరుకు అనుమతి ఇచ్చిందన్న ఒక అబద్ధపు సాకుతో, యధేచ్ఛగా ఇతర మొరం మాఫియా సమూహాలుగా ఏర్పడి కాలువ నుండి మొరాన్ని తరలి స్తూ డబ్బులు దండుకుంటున్నారు. రాబోయే రోజుల్లో కాకతీయ ఎస్సారెస్పీ కాలువ గండ్లు పడి కూడిపోయే ప్రమాదముందని ప్రజలు ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఎస్సారెస్పీ కాకతీయ కాలువ అధికారులు గానీ, మైనింగ్ అధికారులు గానీ, పోలీసు సిబ్బందిగానీ, రెవెన్యూ సిబ్బంది గానీ, రవాణా శాఖ గానీ తవ్వకా లను పట్టించుకోవడం లేదని ప్రజలు అనుకుంటున్నారు.అందరూ నిమ్మకు నీరెత్తి నట్లు ఉంటూ ప్రజలకు కావాల్సిన సాగునీటి కోసం ఏర్పాటుచేసిన కాలువల మనుగడకు ప్రమాదం ఏర్పడే పరిస్థితి ఉంది. ఇప్పటికైనా మొరం అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తులను గుర్తించి,వారి వాహనాలను స్వాధీనం చేసుకొని,రాజ్యాంగ ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు వేడుకుంటున్నారు.