Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రంపై పోరాటం కొనసాగుతుంది
- ప్రజా క్షేత్రంలో బీజేపీ తీరును ఎండగడతాం
- రైతుల పక్షపాతి బీఆర్ఎస్ ప్రభుత్వం
- 23న కుడా గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభ
- ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినరుభాస్కర్
నవతెలంగాణ-ఎన్జీవోస్ కాలనీ
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతూ కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతుందని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినరుభాస్కర్ ఆరోపించారు. హనుమ కొండ రాంనగర్‌లోని గురువారం నిర్వహిం చిన వి లేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతిప క్షాలపై బీజేపీ ప్రభుత్వం కావాలని దర్యాప్తుసంస్థ ల ను ఉసిగొల్పుతోందని ఆరోపించారు. రైతుల తరపు న పోరాడిన ప్రభుత్వం బీఆర్ఎస్ అన్నారు. సీఎం కే సీఆర్ రైతులపక్షపాతి అని కేంద్ర ప్రభుత్వ విధానా లపై ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం కొనసాగు తుందని స్పష్టం చేశారు. చివరకు ప్రభుత్వ పథకా లకు మార్గదర్శకాలుగా, నిజమైన గ్రామ అభివృద్ధి అంటే ఎలా ఉండాలో గంగదేవిపల్లి లాంటి గ్రామం లో ప్రత్యక్షంగా చూపించిన బాలవికాస వంటి స్వ చ్ఛంద సంస్థలను కూడా వదిలి పెట్టడంలేదని క్రైస్తవ , ముస్లిం మైనారిటీ సంస్థలను అణిచి వేయడమే న రేంద్ర మోడీఏకైక లక్ష్యంగా కనబడుతోందని బాల వి కాస సంస్థలపై చేసిన ఐటీదాడులను తీవ్రంగా ఖండ ిస్తున్నామన్నారు. మహిళా బిల్లు కోసం పోరాడి నందు కే కవితపై ఈడి సీబీఐ కేసులను కుట్రపూరి తంగా మోపారని అన్నారు. కేంద్రంపై పోరాడుతున్న ఇతర ప్రతిపక్ష పార్టీల పైన కూడా బీజేపీ కక్షపూరితంగా ద ర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తుందన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్‌కి తెలిసింది ప్రాజెక్ట్ లను నిర్మించడం పేదరికాన్ని నిర్మూలించడం అయితే న రేంద్ర మోడీకి మాత్రం మత విద్వషాలను రెచ్చగొట్టి దేశాన్ని విడగొట్టడం తమను ప్రశ్నించే ప్రతిపక్ష పారీ ్టలను ప్రభుత్వాలను పడగొట్టడం మాత్రమే తెలుసు అన్నారు. ఈనెల 23న హనుమకొండ జిల్లాలో రాష్ట్ర మంత్రివర్యులు కేటీఆర్ పర్యటించనున్నారని తెలిపా రు. పలుఅభివృద్ధి కార్య క్రమాలు, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని మంత్రిప్రారంభించనున్నారని తెలిపా రు. ఈ సందర్భంగా కుడా మైదానంలో భారీ బహి రంగ సభను నిర్వహించనున్నట్లు తెలిపారు. బండి సంజయ్ కవితకు భేషరతుగా క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కూడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్రాజ్ యాదవ్ లైబ్రరీ చైర్మన్ అజీజ్ ఖాన్ గారు, మాజీ కూడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి , కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, బీఆర్ఎస్ సీని యర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.