Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీఆర్డీవో ఆకవరం శ్రీనివాస్‌కుమార్
నవతెలంగాణ-కమలాపూర్
తెలంగాణకు హరితహారం కార్యక్రమానికి ప్రతీ గ్రామంలో మొక్కలు నాటేందుకు ప్రణాళిక సిద్ధం చే యాలని డీఆర్డీఓ ఆకవరం శ్రీనివాస్‌కుమార్ అన్నా రు. గురువారం మండలంలోని పలు గ్రామాలలో న ర్సరీలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కలు నాటుటకు ప్రణాళిక సిద్ధం చేసు కోవాలని అధికారు లకు సూచించారు. 48 గంటల్లో ప్రతి గ్రామంలో తప్పనిసరిగా నర్సరీలో ఉ న్న ప్రతిబ్యాగులో విత్తనా లుగానీ, నారులేదా కటింగ్ పెట్టాలని ప్రతినర్సరీలో పెంచబడుతున్న మొక్కల వివరాలను ఒకఫ్లెక్సీ రూ పంలో గ్రామప్రజలకు అర్థమయ్యేవిధంగా తగిలించా లని నర్సరీలో పెంచుతున్న మొక్కలకు తగినట్టుగా ప్రణాళికలను సిద్ధం చేసుకుని కలెక్టర్‌కు అతి త్వరగా పంపాలన్నారు. ప్రతీనర్సరీలో తప్పనిసరిగా మునగా, టేకుమా, పపాయతోపాటు3 రకాల పండ్ల మొక్కలు, మూడురకాల పూలమొక్కలు పెంచాలని, వేసవి దృ ష్ట్యా ప్రతిరోజూ ఉదయం ఎనిమిది గంటల లోపు సా యంత్రం 4గంటల తర్వాత విధిగా నర్సరీ లోని ప్రతి మొక్కలకు నీరు అందించాలని, అనివార్య కారణాల వల్ల మొక్కలు చనిపోతే వెంటనే పెట్టడానికి ప్రైమరీ బెడ్స్లలో విత్తనాలు వేసి నారు సిద్ధం చేసుకోవాలని, గ్రామంలో వివిధ ప్రాంతాలలో నాటిన మొక్కలకు వారానికి రెండుసార్లు నీరు పట్టించాలని, పంచాయి తీరాజ్చట్టం ప్రకారం ప్రతీగ్రామంలో 85శాతం మొ క్కలు బతికించాలని ఆదేశించారు. పై ఆదేశాలను పా టించని అధికారులపై జిల్లా కలెక్టర్ ద్వారా కఠిన చ ర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీఓ విమల, పంచాయతీ కార్యదర్శి రాజారాం, ఉపాధి హామీ సిబ్బంది తదిత రులు పాల్గొన్నారు.