Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ములుగు ఎమ్మెల్యే డాక్టర్ సీతక్క సమీక్ష
నవతెలంగాణ - ములుగు
గోదావరి జలాలు దేవాదుల ద్వారా నియోజక వర్గంలోని అన్ని మండలాలకు సాగునీరు అందించాలని ఇరిగేషన్ అధికారులను ఎమ్మెల్యే డాక్టర్ సీతక్క ఆదేశిం చారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నీటి పారుదల శాఖ అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించి సీతక్క మాట్లాడారు. తలాపునే గోదావరి ఉన్న ఇక్కడి నుండి గోదా వరి జలాలు పక్క నియోజక వర్గాలకు తరలించుకు పోతు న్నా... స్థానికంగా చుక్క నీరు రాకపోవడం వల్ల రైతులకు సాగు నీరు రాక పంటలు దెబ్బతిన్నాయన్నారు. ఎస్ఆర్ఎస్పి కాలువలు ఆధునీకరించి వెంకటాపూర్ మండలం లోని రామప్ప నుండి కేశవ పూర్ వరకు కెనాయిల్ ఆధునీక రించాలన్నారు. ములుగు మండలం లోని దేవాగిరి పట్నం పత్తిపెల్లి, పోట్లపూర్, సర్వపుర్ కాశిందేవిపేట, అంకన్న గూడెం, రాయిని గూడెం గ్రామాల రైతులకు సాగు నీరు అందించాలన్నారు. కొడిషల కుంటకు మంజూరైన దేవా దుల పైపులైన్ పూర్తి చేసి రైతులకు సాగు నీరు అందిం చాలన్నారు. రామప్ప నుండి లక్న వరం, రామప్ప నుండి కోడిషల కుంట వరకు మంజూరైన దేవాదుల పైపు లైన్ వరకు భూ సేకరణ పూర్తి చేయాలని అన్నారు. కెనాల్ ఆధునీకరణకుప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి అందించాలని అధికారులకు సూచించారు.