Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- కోల్బెల్ట్
హాస్పిటల్ మేనేజ్మెంట్ సిస్టం, ఈఆర్పి- ఎస్ఏపి అనే కార్యక్రమంపై కార్పొరేట్ అధికారులు హరిశంకర్ డీజిఎం (ఐటి), నాగ దీప డిప్యూటీ మేనేజర్(ఐటి) గురువారం భూపాలపల్లి ఏరియా ఏరియాలోని ఆయా గనుల సంక్షేమ అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని జిఎం కార్యాలయం సమావేశం మందిరంలో జరిగిన అవగాహన కార్యక్రమానికి ఏరియా రక్షణాధికారి జి ఎల్ ప్రసాద్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కార్పొరేట్ అధికా రులు మాట్లాడుతూ ఈ ఆర్ పి -ఎస్ ఏ పి లో ఉద్యోగులకు సంబంధించిన వివరాలు పొందుపరచునప్పుడు తీసుకో వాల్సిన జాగ్రత్తలు వివరించారు. ఈ కార్యక్రమంలో డివై సీఎంవో డాక్టర్ పద్మజ, ఐటీ మేనేజర్ రజనీకుమారి, వివిధ గనుల సేఫ్టీ, సంక్షేమ అధికారులు పాల్గొన్నారు.