Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజాస్వామ్య పరిరక్షణకే జనచైతన్య యాత్ర : బొట్ల చక్రపాణి
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
బిజెపి పాలనలో మతసామరస్యానికి తూట్లు పొడిచారని, మత సామరస్యం, ప్రజాస్వామ్య పరి రక్షణకే సీపీఐ(ఎం) ఆలిండియా కమిటీ పిలుపు మేరకు రాష్ట్రంలో జన చైతన్య యాత్రను నిర్వహిస్తుం దని పార్టీ హన్మకొండ జిల్లా కన్వీనర్ బొట్ల చక్రపాణి తెలిపారు. గురువారం 'నవతెలంగాణ'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జన చైతన్య యాత్ర ఉద్దేశం, యాత్ర జరిగే తీరును వివరించారు. ఒకే మతమంటూ హిం దూయేతర మతాలపై కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దాడులు సాగిస్తుందన్నారు. దళిత, గిరిజన, మహిళా, మైనార్టీ, బిసిలపై నిరంతరం దాడులు జరుగు తున్నాయన్నారు. రాజ్యాంగ యంత్రాంగాన్ని దుర్వి నియోగం చేస్తుందన్నారు. గవర్నర్ల వ్యవస్థను ఆర్ఎ స్ఎస్ నాయకులతో నింపి రాష్ట్రాల హక్కులను కాల రాస్తుందన్నారు. బీజెపియేతర ప్రభుత్వాల పట్ల నిరంకుశ వైఖరిని కొనసాగిస్తున్నారన్నారు. బిజెపి, ఆర్ఎస్ఎస్ రాస్ట్రంలో మతాల చిచ్చు పెట్టి గద్దెనెక్కాలనే రాజకీయ వికృత క్రీడ ఆడుతున్నాయ న్నారు. మతసామరస్యాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిర క్షించడానికే జనచైతన్య యాత్రను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జనచైతన్య యాత్ర సందర్భంగా శుక్రవారం ఉదయం 8.00 గంటలకు కాజీపేట రైల్వే జంక్షన్ నుండి బైక్ ర్యాలీ బయలు దేరి 'కుడా' గ్రౌండ్‌కు చేరు కుంటుందని, అక్కడ ఉదయం 9.00 గంటలకు జరిగే బహింరగసభలో సిపిఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాల్గొని ప్రసంగించనున్నట్లు తెలిపారు. ఈ సభలో సిపిఐ (ఎం) కేంద్ర కమిటీ సభ్యులు జి నాగయ్య, చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యులు పోతినేని సుదర్శన్‌రావు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, పాలడుగు భాస్కర్, మల్లు లక్ష్మీ తదితరులు పాల్గొని ప్రసంగిస్తారన్నారు. బహిరంగసభ ముగిశాక బైక్‌ర్యాలీ నేరుగా వరంగల్ ఆజాంజాహి మిల్లు మైదానానికి చేరుకుంటుంద న్నారు. 'కుడా' మైదానంలో జరిగిన బహిరంగసభను విజయవంతం చేయాలని కోరారు.
విభజన చట్టానికి తూట్లు
విభజన చట్టంలో రాష్ట్రానికి ఇచ్చిన హామిలను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నెరవేర్చడం లేదు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ విషయం చట్టంలో లేదని స్వయంగా కేంద్ర మంత్రి బుకాయించడం దారుణమన్నారు. గుజరాత్ రాష్ట్రంలో కోచ్ ఫ్యాక్టరీని మంజూరు చేసిన మోదీ, కాజీపేటకు మంజూరు చేయలేదన్నారు. ఇదిలావుంటే ప్రధాని మోదీ ప్రైవేటీ కరణ విధానాలతో కార్మికులు తీవ్రంగా నష్టపోతు న్నారన్నారు. కాజీపేటలోని లోకోలను విజయవాడ, బల్లార్షలకు తరలిస్తున్నారని, ఇది ఆపకపోతే భవిష్య త్తులో కాజీపేట జంక్షన్ ఉనికి ప్రమాదంలో పడుతుందన్నారు.
పేదలకు పట్టాలివ్వాలి
గత ఏడాది మేలో హన్మకొండ జిల్లాలో పెద్ద ఎత్తున భూపోరాటం చేశామని, 8 కేంద్రాల్లో భూపోరాటంలో భాగంగా 8-10 వేల గుడిసెలు వేయడం జరిగిందన్నారు. కాజీపేట మండలంలోని కోటచెరువు, బంధం చెరువు, హన్మకొండలోని గోపాలపురం చెరువు, హసన్‌పర్తి మండలంలోని చేపల కేంద్రం, ఎర్రచెరువు, పెగడపల్లి చెరువు, ఎల్కతుర్తి మండలం మావు చెరువు, ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామాల్లో పెద్ద ఎత్తున పేదలు భూపోరాటంలో పాల్గొన్నారన్నారు. వేలేరు మండలం ఇచ్చులపల్లిలో సాగుభూమి కోసం పోరాటం జరిగిందన్నారు. వీరందరికీ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పట్టాలివ్వాలన్నారు. కాజీపేట మండలం మెట్టుగుట్ట దేవస్థానం భూముల్లో 15 ఏండ్ల క్రితం సీపీఐ(ఎం) నేతృత్వంలో జరిగిన భూ పోరాటంలో 400 కుటుంబాలు గుడిసెలు వేసుకొని జీవనం సాగిస్తు న్నాయన్నారు. 2022 జనవరిలో ఇక్కడి ఇండ్లను ప్రభుత్వం కూల్చివేసే ప్రయత్నం చేసినా, పార్టీ కార్యకర్తలు, ప్రజలు తీవ్రంగా ప్రతిఘటించి ఇండ్లను కాపాడుకున్నారన్నారు. వీరందరికి దేవస్థానం భూములను కొని పట్టాలు పంపిణీ చేయాలన్నారు. 2022 మేలో జరిగిన భూ పోరాటంలో పెద్ద ఎత్తున పేదవర్గాలు పాల్గొన్నాయన్నారు. పోలీసుల నిర్బంధాన్ని, కేసులను సైతం ఎదుర్కొని ఆయా ప్రాంతాల్లోనే నివాసముంటున్నారన్నారు.