Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
నవతెలంగాణ-రేగొండ
కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఆడబిడ్డలకు గొప్ప వరమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ వెంకటరమణరెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మండలంలోని 83 మంది కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు రూ.83 లక్షల పైచిలుకు చెక్కులను, ముఖ్యమంత్రి సహాయనిధి కింద 9మందికి గాను రూ.4 లక్షల 45వేల విలువైన చెక్కులను అందించారు. అనంతరం ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాల వారికి అండగా నిలుస్తోందన్నారు. మహిళలు, రైతులు, పేద ప్రజలకు ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. అనంతరం మండల కేంద్రంలోని గౌడ కులస్తుల ఆధ్వర్యంలో గౌడ సంఘం క్యాలెండర్ 2023 ను ఆవిష్కరించారు. గీత కార్మికులకు గీత పన్ను రద్దు చేసి వారి అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. తక్కువ వయసులోనే గీత సోదరులకు ప్రభుత్వం పెన్షన సౌకర్యాన్ని కల్పించిందని అన్నారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కమ్యూనిటీ హాలుకు స్థలం కేటాయించి, కమ్యూనిటీ భవన నిర్మా ణానికి నిధులు అందించేలా కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ షర్ఫుద్దీన్, ఎంపీడీవో సురేందర్, ఎంపీపీ లక్ష్మీ రవి జడ్పిటిసి విజయ, జిల్లా రైతు బంధు కోఆర్డినేటర్ మహేందర్, పిఎసిఎస్ చైర్మన్ విజన్ రావు, వైస్ చైర్మన్ పాపిరెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ సంతోష్, స్థానిక సర్పంచ్ నిషిద్ధర్, రెడ్డి, ఎంపీటీసీ సుమలత బిక్షపతి , బిఆర్ఎస్ మండల అధ్యక్షులు అంకం రాజేందర్, నాయకులు ఉమేష్ గౌడ్, కొలపాక బిక్షపతి, రజినీకాంత్, సర్పంచులు రంజిత్, శ్రీనివాస్, సుమలత భాస్కర్, రజిత రాజు, సర్పంచులు, ఎంపీటీసీలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.