Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు మహబూబాబాద్ తహసిల్దార్ కార్యాలయ సెంటర్లో జన చైతన్య యాత్ర బహిరంగ సభ
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాక
నవతెలంగాణ మహబూబాబాద్
దేశంలో సంక్షేమం, మతసామరస్యం ప్రజాస్వామ్యం సామాజిక న్యాయం పరిరక్షించడమే లక్ష్యంగా సీపీఐ(ఎం) చేపట్టిన భారీ ప్రజా జన చైతన్య యాత్ర విజయవంతానికి మానుకోటలో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. బీజేపీ మతోన్మాద కార్పొరేట్ విధానాలను వ్యతిరేకిస్తూ దేశ ప్రజలను చైతన్యం చేయడమే లక్ష్యంగా రాష్ట్రంలో బీజేపీని కట్టడి చేసి ఒంటరి చేయడమే ధ్యేయంగా భారీ ప్రణాళిక సీపీఐ(ఎం) రూపొందించింది. మార్చి 17 నుంచి 29 వరకు యాత్రలు తెలం గాణ వ్యాప్తంగా చేపట్టనున్నారు. నేడు వరంగల్ నుండి యాత్ర బయలు లుదేరనుంది. అదే రోజు సాయత్రం 5 గంటలకు మానుకోటకు యాత్ర చేరు కుంటుంది. అనంతరం ములుగు భూపాలపల్లి, కొత్తగూడెం భద్రాచలం ఖమ్మం సూర్యాపేట నల్గొండ మీదుగా హైదరాబాద్ చేరుకుంటుంది. ఈ యాత్ర నేడు మానుకోటకు చేరుకుంటున్న సందర్భంగా పార్టీ శ్రేణులు విస్తృత ప్రచారం నిర్వహించారు. నెల రోజులుగా సభలు, సమావేశాలు, గ్రూప్ మీటింగులు ప్రజాసంఘాల మీటింగులు నిర్వహంచడమే కాకుండా అనుబంధ సంఘాల కార్యకర్తలు జిల్లా వ్యాప్తంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అలాగే యాత్ర కొనసాగే రూట్లో భారీగా తోరణాలు ఫ్లెక్సీలు ఎర్రజెండాలు కట్టారు. బహిరంగ సభ స్థలాన్ని జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్, నాయకులు సుర్ణపు సోమయ్య గునిగంటి రాజన్న ఆధ్వర్యంలో పార్టీ బృందం పరిశీలించింది. యాత్రలో రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ కేంద్ర కమిటీ సభ్యులు జి నాగయ్య పాల్గొంటారు. మహబూబాబాద్ జిల్లాలో ఏర్పాట్లను జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్ పర్యవేక్షిస్తున్నారు. బహిరంగ సభకు సీపీఐ(ఎం)తోపాటు సీఐటీయూ అనుబంధ కార్మిక సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘం, కేవీపీఎస్, గిరిజన సంఘం ఉపాధ్యాయ ఉద్యోగ కార్మిక సంఘాలు వివిధ వర్గాల కార్మికులు, ప్రజాతంత్రవాదులు, విద్యావంతులు, మేధావులు కూడా భారీ సంఖ్యలో హాజరుకానున్నారు.