Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హాజరు కానున్న సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి
- రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కేంద్ర కమిటీ సభ్యులు జి నాగయ్య
- యాత్ర బృందం నాయకులు పోతినేని సుదర్శన్‌రావు
- ప్రారంభ సభ ఏర్పాట్లను సమీక్షించిన వరంగల్ జిల్లా కమిటీ
నవతెలంగాణ - మట్టెవాడ
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లో ఎండగట్టి ప్రజల్లో చైతన్యం నింపే దిశగా సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన జన చైతన్య యాత్ర ప్రారంభ సభ వరంగల్ లోని 27వ డివిజన్ ఆజాంజాహి మిల్ గ్రౌండ్లో నేడు జరగనుంది. జన చైతన్య ప్రారంభంకులు సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి , రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కేంద్ర కమిటీ సభ్యులు జి నాగయ్య, యాత్ర బృందం నాయకులు పోతినేని సుదర్శన్‌రావు, తదతరులు హాజరు కానున్నారు. సంబంధిత పనులు చకచకా జరుగుతున్నాయి. సభ ప్రాం గణమంతా ఎరుపుమయం అయ్యేలా వరంగల్ జిల్లా కమిటీ దగ్గరుండి పర్యవేక్షించింది. పార్టీ వరంగల్ జిల్లా కమిటీ కార్యదర్శి చింతమల్ల రంగయ్య ఆధ్వర్యంలో జిల్లా కమిటీ నాయకులు సంబంధిత పనులను గురువారం దగ్గరుండి పరిశీలించి పలు సూచనలు చేశారు. సుమారుగా 25 వేల పైచిలుకు జన సమీకరణకు అనుకూలంగా సభ ప్రాంగాణా నికి ఎదురుగా ఇరువైపులా రెడ్ కార్పెట్లు పరుస్తూ, సభకు వచ్చే ప్రజలు కూర్చునే విధంగా కుర్చీలను ఏర్పాటు చేశారు. డిజె సౌండ్ బాక్సులు, లైటింగ్‌లతో పాటు సభకు వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పా ట్లను చేశారు. నేడు 11 గంటలకు సభ ప్రారంభం అతుంది. కాగా ఆజంజాహిగ్రౌండ్ లో జనచైతన్య యాత్రకు వరంగల్ తూర్పు నియోజకవర్గం నుండి నాలుగు వైపుల నుండి కమ్యూనిస్టులు ఎర్రని చీరలు, ఎర్రని అంగీలతో రెడ్ కవాతు నిర్వహిస్తూ భారీ ర్యాలీగా జన చైతన్య యాత్రకు తరలివచ్చేవిధంగా పార్టీ నాయకులు చర్యలు తీసుకుం టున్నారు. నగరం నలువైపులలో ప్రధాన కూడళ్లలో సభకు సంబంధించిన స్వాగత తోరణాలు పెద్ద పెద్ద ఫ్లెక్సీల ఏర్పాటు చేశారు. సభ ఏర్పాట్లను సమీక్షించిన వారిలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు జగదీష్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సింగారపు బాబు, ముక్కెర రామస్వామి, భూక్య సమ్మయ్య ఈసంపల్లి బాబు జిల్లా కమిటీ సభ్యులు హనుమకొండ శ్రీధర్‌లు పాల్గొన్నారు.