Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యవసాయశాఖ అధికారి పోరిక జై సింగ్
నవతెలంగాణ -తాడ్వాయి
రైతులు యాసంగి పంటల వివరాలు తప్ప నిసరిగా నమోదు చేసుకోవాలని మండల వ్యవసా యశాఖ అధికారి కోరిక జై సింగ్ సూచించారు. గురు వారం మండలంలోని బంధాల గ్రామపంచాయతీ పరిధి పోచాపూర్ గ్రామంలో రైతులు సాగు చేసిన మొక్కజొన్న పంటను ఏఈఓ రవికుమార్‌తో కలిసి పరిశీలించి, పంట నమోదు కార్యక్రమం నిర్వ హించారు. ఈ సందర్భంగా పోరిక జైసింగ్ మాట్లా డుతూ యాసంగిలో రైతులు వారి పొలంలో సాంగ్ చేసిన పంటలు, రకం, సాగు చేసిన విస్తీర్ణాలను ఆయా గ్రామాల వ్యవసాయ విస్తీర్ణ అధికారుల వద్ద నమోదు చేసుకోవాలని సూచించారు. వ్యవసాయ శాఖ విస్తరణ అధికారులు పంట పొలాలను క్షేత్రస్థా యిలో పరిశీలించి పంటలు నమోదు చేస్తారని ఆ సమయంలో రైతులు అందుబాటులో ఉండి వివరా లు తెలుపాలన్నారు. తద్వారా పంట ఉత్ప త్తులను అమ్ముకోవడానికి, పంట నష్టం జరిగినప్పుడు అంచనా వేయడానికి ఉపయోగపడుతుందని అన్నా రు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి రవికుమార్, రైతులు తదితరులు పాల్గొన్నారు.