Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధాన్యం కొనుగోలు పై సాగిన చర్చ
- అభివృద్ధికి సహకరించాలి: ఎంపీపీ
నవతెలంగాణ- కాటారం
ప్రతి మూడు నెలలకు ఒకసారి గ్రామీణ ప్రాం తాల ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక వసతులు, ప్రభు త్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, మొదలగు అం శాలపై నిర్వహించే మండల సర్వసభ సమావేశం వాడివేడిగా సాగింది. గురువారం మండల కేంద్రం లోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ పంతకాని సమ్మయ్య అధ్యక్షతన మండల సర్వసభ సమావేశం నిర్వహించారు. మండల ప్రత్యేక అధికారి సంజీవరావు, ఎంపీడీవో శంకర్ నాయక్, పలు శాఖల అధికారులు పాల్గొన్న సభలో ప్రజా సమస్యలపై ప్రజా ప్రతినిధులు ప్రశ్నలు లేవనెత్తగా సంబంధిత అధి కారులు సమాధానం ఇచ్చారు. ధాన్యం కొనుగోలు భారీ ఆక్రమణలు జరిగాయని గౌరవ సభ్యులు సభ దష్టికి తీసుకువచ్చారు. ఎంపీపీ సమ్మయ్య స్పందిస్తూ మల్లారం, విలాసాగర్, లక్ష్మి పూర్ గ్రామాలలోని రైతు లు ధాన్యం అమ్ముకొని సుమారు మూడు నెలల కావ స్తున్నా రైతుల ఖాతాలో అధికారులు డబ్బులు జమ చె య్యకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సెంటర్ నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని అ న్నారు. ఎంపీటీసీ జాడి మహేశ్వరి మాట్లాడుతూ గత సమావేశాలలో అధికారుల దష్టికి తీసుకువచ్చిన మిషన్ భగీరథ సమస్యలను నేటికీ పరిష్కరించక పోవడంపై అసహనం వ్యక్తం చేశారు. అధికారులు సమావేశంలో సమాధానాలు మాత్రమే చెబుతున్నారని సమస్యలను మాత్ర పరిష్కారాన్ని చూపడం లేదని అన్నారు. మిషన్ భగీరథ తాగునీటి సరఫరా సక్ర మంగా కాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతు న్నారని గౌరవ సభ్యులు సభ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై ఎంపీపీ సమ్మయ్య స్పందిస్తూ తాగునీటి సర ఫరాలో ఇబ్బందులు ఏర్పడకుండా వెంటనే పరిష్కరిం చాలని అధికారులకు సూచించారు. వేసవిలో నీటి సమస్య ఏర్పడకుండా చూడాలన్నారు. కాటారం మార్కెట్ కమిటీ నూతన చైర్మన్గా పదవీ బాధ్యతలు చేపట్టి సమావేశానికి హాజరైన చైర్మన్ పెండ్యాల మమతను గౌరవ సభ్యులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాటారం తాసిల్దార్ జివాకర్ రెడ్డి, ఎంపీ ఓ ఉపేంద్రయ్య, ఎంపీటీసీలు తోట జనార్ధన్, బాసాని రవి, జాడి మహేశ్వరి రమేష్, రవీందర్ రావు, బోడ మమత నరేష్, విజయ రెడ్డి, సర్పంచులు దేవేందర్ రెడ్డి, జంగిలి నరేష్, కోడి రవికుమార్, రఘురాం నాయక్, అంగజాల అశోక్, ఆకుల చంద్రశేఖర్, కంకణాల లత, అధికారులు తదితరులు పాల్గొన్నారు.