Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దొంగ ఆదానికి మోడీ రక్షణ
- బీజేపీ దేశానికి ప్రమాదకారి
- తెలంగాణ అడ్డా కమ్యూనిస్టుల గడ్డ
- బీజేపీని ఒంటరి చేయడమే లక్ష్యం
- జన చైతన్య యాత్ర బహిరంగ సభలో నేతల పిలుపు
నవతెలంగాణ-మహబూబాబాద్
దేశ ప్రజలందరికీ సమాన హక్కులు కల్పిస్తూ రక్షణగా ఉండే పవిత్ర గ్రంథంగా భావించే రాజ్యాంగాన్ని రద్దు చేసేం దుకు మతోన్మాద ఫాసిస్ట్ కార్పొరేట్ విధానాలతో 2024లో అధికారంలోకి రావడం కోసం బీజేపీ చేస్తున్న కుట్రలను ఎం డగట్టి ప్రజలను చైతన్యం చేయటం లక్ష్యంగా బీజేపీి వ్యతి రేక శక్తులు ఏకం చేయడమే ధ్యేయంగా ప్రజలలో చైతన్యం రగి లించేందుకు సీపీఎం ఆధ్వర్యంలో జన చైతన్య యాత్ర లు చేపట్టినట్లు సీపీిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించారు.శుక్రవారం వరంగల్‌లో సిపిఎం జన చైతన్య యాత్ర మానుకోట చేరుకుంది. మానుకోటలో తహసిల్దార్ కార్యాలయం సెంటర్లో సిపిఎం జిల్లా కార్యదర్శి సాధన శ్రీని వాస్ అధ్యక్షతన నిర్వహించిన సభలో తమ్మినేని వీరభద్రం తో పాటు ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్, సీపీఎం కేంద్ర కమి టీ సభ్యులు జీ.నాగయ్య,సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు,పాలడుగు భాస్కర్, సిపిఐ జిల్లా కార్యదర్శి బి.విజయ సారథి, సిపిఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్ పాల్గొన్నారు.
తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు 2024లో పార్లమెంటు ఎన్నికల్లో జరగను న్నాయన్నారు. తెలంగాణ అసెంబ్లీలో అధికారంలోకి రావ డం కోసం కొత్త ఎత్తుగడతో బీజేపీ ముందుకు వస్తుందని ప్రజలు అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందన్నారు. దేశం లో ఉన్న అన్ని పార్టీల కంటే బిజెపి అత్యంత ప్రమాదకర పార్టీ అని అన్నారు.బిజెపి వెనుక ఉన్న ఆర్ఎస్ఎస్ విధానాల ను అమలు చేయడమే బిజెపి లక్ష్యమన్నారు. ఆర్ఎస్ఎస్ అంటే రాజ్యాంగాన్ని రద్దుచేసి మనధర్మ శాస్త్రను అమలు చేయడమే దాని ఉద్దేశమని అన్నారు. రాజ్యాంగం అంటే ఖురాన్, బైబిల్, భగవద్గీత కంటే పవిత్ర గ్రంథంగా ప్రజలు భావిస్తున్నారని ప్రజల హక్కుల పరిరక్షించబడే గ్రంథంగా విలసిల్లు తుందన్నారు. రాజ్యాంగం దేశ వినాశనానికి పా ల్పడుతున్న బిజెపి కుట్టను ప్రజలు అర్థం చేసుకోవాలని బిజెపిని ఒంటరి చేయాలని ఓడించాలని పిలుపు నిచ్చారు. ప్రధానంగా భారతదేశానికి రాజ్యాంగం కల్పించిన లౌకిక ప్రజాస్వామ్య సామ్యవాద ఫెడరల్ విధానాలకు కాలరా యాలని చూస్తుందని అన్నారు. దేశంలో గత అనేక సంవత్స రాలుగా హిందూ ముస్లింలు క్రిస్టియన్లు బౌద్ధులు జైనులు పార్సీలు ఐక మత్యంగా జీవిస్తున్నారని వారి మధ్య మత తత్వ చిచ్చులు పెట్టి హిందుత్వం హిందుత్వం పేరుతో ప్రజ లను రెచ్చగొట్టే అధికారంలోకి రావాలని చూస్తుందని అ న్నారు. రాజగోపాల్‌ను గెలిపిస్తే కేసీఆర్ ప్రభుత్వం కూలు స్తామని చెప్పడం హాస్యాస్పదం అని అన్నారు. ముగ్గురు నలుగురు ఎమ్మెల్యేలతో 199 మంది ఎమ్మెల్యేలు ఉన్న అ సెంబ్లీని ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. దీని వెనక ఎమ్మెల్యేలను అడ్డదారులు కొనుగోలు చేయడం కోసం కు ట్రలు పన్నాడని ఒక హౌం శాఖ మంత్రి అలా మాట్లాడడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించాడు. గెలిచిన ఎమ్మె ల్యేలను సంతలో గొర్రెలు లేక బర్రెలు లాగా కొనుగోలు చే సి అడ్డదారులు అధికారులకు వస్తున్నారని విమర్శించారు. బిజెపి విధానాలను, బిజెపి నేతలను విమర్శించిన వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని ఈడి సిబిఐ బెదిరింపులకు గురి చేస్తున్నారని విమర్శించారు.పార్లమెంటులో మోడీను విమర్శించే వద్దంటూ చట్టాలు చేస్తున్నారని,సామాజిక మా ధ్యమాలు పత్రికలలో రాసిన వారిపై సంకెళ్లు వేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలైన ఈడి సిబిఐని కాపలా కుక్కలాగా పెట్టుకొని ప్రతి పక్ష పార్టీలు నేత లను బెదిరిస్తున్నారన్నారు. కెసిఆర్ బిజెపి వ్యతిరేక శక్తులను ఏకం చేస్తున్నందున కేసీఆర్ కూతురు కవితపై కేసులు బనాయించి ఈడి నోటీసులు ఇచ్చి అరెస్టు చేస్తారంటూ పు కార్లు పుట్టిస్తున్నారని విమర్శించారు. తాను తప్పు చేస్తే జైలుకు వెళ్లడానికి సిద్ధమని కవిత ప్రకటించినప్పటికీ ఒక మహిళను చూడకుండా అడ్డదారులలో వేధిస్తున్నారని విమ ర్శించారు. దేశంలో అడ్డదారిలో 19 లక్షల కోట్ల సంబంధిం చిన ఆదాని సంగతి ఏమిటని ప్రశ్నించారు. అదాని అక్రమ ఆదాయ వనరులను ఈడనుబరుగు నివేదిక స్పష్టం చేసి నప్పటికీ ఆయనపై ఎందుకు చర్య తీసుకోవడం లేదని ప్ర శ్నించారు. ఆదోని అక్రమ మార్గాలలో వజ్రాల వ్యాపారం చే యకుండా చేసినట్లుగా కాగితాలపై చూపించి ప్రభుత్వం నుంచి ఒక్క ఏడాదిలో 687 కోట్ల రాయితీ ప్రభుత్వం నుంచి పొందాడని ఇలా అనేక మార్గాలలో అక్రమ ఆదాయం పొం దాడన్నారు. మోడీ హయాంలో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైం దని విమర్శించారు.అంతేకాక ఫెడరల్ వ్యవస్థకు విఘాతం కలుగుతుందన్నారు. రాష్ట్రాలు హక్కులను కూడా హరిచివే స్తున్నారని జీఎస్టీ పేరుతో రాష్ట్రాలకు ఉన్న అధికారంను లాక్కుంటున్నారని అన్నారు. తెలంగాణ పన్నులను కేంద్రం వసూలు చేసుకొని మనకు రావాల్సిన వాటని బిక్షంగా వే స్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాల ఆధీనంలో ఉండే విద్యా వైద్యం ఉపాధి ఉద్యోగం వ్యవసాయ విద్యుత్ రంగా లను లాక్కుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో వ్యవసాయ రంగంలో తెచ్చిన అక్రమమార్గంలో వచ్చిన మూ డు చట్టాలను ప్రతిపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఏడాది పాటు రద్దు చేసే అంతవరకు పోరాట నిర్వహించినట్లు తెలిపారు. విద్యుత్ ఉత్పత్తికి అయ్యే ఖర్చు మొత్తం ప్రజల నుంచి వసూ లు చేయాలని చూస్తుందని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నష్టం జరుగుతుందని అన్నారు. సామాజిక న్యాయానికి ఎసరు పెడుతున్నారని, మహిళలకు లక్షలు లేకుండా పోయిందని, రాజ్యాంగ న్యాయ సూత్రాలు ఉల్లంఘిస్తున్నారని విమర్శిం చారు. దేశంలో రాజ్యాంగం రద్దు చేసి మనుధర్మ శాస్త్ర అమ లు చేసినట్లయితే దళిత గిరిజన బడుగు బలహీన వర్గాలకు తీరని అన్యాయం మహిళలకు విద్య ఉద్యోగం ఉపాధి రంగా లలో అవకాశాలు లేకుండా వంటింటికే పరిమిత అవుతా రని, కుల మతాల మధ్య చిచ్చులు పెడతారని, చతుర్వర్ణ వ్యవస్థను తీసుకువస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. తెలం గాణ గడ్డ కమ్యూనిస్టుల ఆడ్డ అని, తెలంగాణలో బిజెపిని రాణిచ్చేది లేదని స్పష్టం చేశారు. నైజాం నవాబు వ్యతిరేకం గా అన్ని వర్గాల ప్రజలు పోరాటాలు చేసిన గడ్డ అని గుర్తు చేశారు. తెలంగాణ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టులు పేదలకు ఆత్మగౌరవంతో నిలిపారని అన్నారు.4000 మంది కమ్యూనిస్టు బలిదానాలు చేసి పది లక్షల ఎకరాల భూము లు పేదలకు పంచారని గుర్తు చేశారు. రాష్ట్రంలో కెసిఆర్ బిజెపికి వ్యతిరేకంగా కేంద్రంలో ప్రతిపక్ష పార్టీలో కూడ గట్టేందుకు కృషి చేయడం శుభపరిణామం అన్నారు. బిజెపి వ్యతిరేక శక్తులను ఐక్యం చేసి వచ్చే అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికలలో బిజెపిని ఒంటరి గుణగడమే లక్ష్యంగా ముందు కు సాగాలని పిలుపు నిచ్చారు.
బీజేపీ వ్యతిరేకశక్తులు ఏకం కావాలి :
ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్
దేశంలో రాష్ట్రంలో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తూ భవిష్యత్తులో రిజర్వేషన్లు తొలగించేందుకు కుట్రపన్నుతున్న బిజెపిని ఓడించేందుకు బిజెపి వ్యతిరేక శక్తులను ఏకం కావాలని ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ పిలుపు నిచ్చారు. మానుకోటలో నిర్వహించిన జనచైతన్య యాత్ర సభలో శంకర్ నాయక్ మాట్లాడారు. బిజెపి 8 ఏళ్ల కాలంలో కార్పొరేట్ విధానాలతో మతతత్వ రాజకీయాలతో దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. సిపిఎం చేపట్టిన జన చైతన్య యాత్ర తెలంగాణ మొత్తం తిరగాలని ప్రజలను చైతన్యం చేయాలని విజ్ఞప్తి చేశారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కావాలని పోరాడిన కేసీ ఆర్ కూతురు కవితపై ఈడీలను బీడీలను ప్రయోగించి అవమానాల పాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల మేలుకోవాలని బిజెపికి వ్యతిరేకంగా తిరగబడాలని పిలుపు నిచ్చారు. బిజెపి అధికారంలో ఉన్న ఎనిమిదేళ్ల కాలంలో రైల్వేలు, ఎల్ఐసి, ఓడరేవులు, బ్యాంకు లు, బొగ్గు గనులను ప్రైవేటుపరం చేసి భవిష్యత్తులో రిజ ర్వేషన్లు తొలగించేందుకు కుట్ర చేస్తున్నారని విమర్శించారు. 1000 నోట్ల రద్దు చేసి 2000 నోట్లు తెచ్చి బ్లాక్ మనీని పెంచి పోషించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య యుతంగా గెలిచిన ఎమ్మెల్యేలు ఎంపీలను సంతలో పశువుల్లాగా కొనుగోలు చేసి అక్రమ మార్గంలో అధికారంలోకి రావాలని చూస్తున్నారని విమర్శించారు. దేశంలో బిజెపి 9 రాష్ట్రాలలో గెలుపొందగా మరో తొమ్మిది రాష్ట్రాలలో అక్రమ మార్గంలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి అధికారంలోకి వ చ్చారన్నారు. బిజెపికి వ్యతిరేకంగా తెలంగాణలో అన్ని పార్టీ లు ఏకం కావాల్సిన అవసరం ఉందని అన్నారు. ముఖ్య మంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రజలకు 50 లక్షల ఆసరా పిం ఛన్లు ఇస్తున్నామని, రైతుబంధు రైతు బీమా, ఉచిత విద్యు త్తు ఇస్తున్న ఘనత కేసిఆర్ దే అన్నారు. మహాత్మా గాంధీ పేదలకు తిండి,బట్ట, గూడు కావాలని ఆనాడే కోరుకున్నార ని అది కేసీఆర్ అమలు చేస్తున్నాడు అని అన్నారు. పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తున్నామని, పోడు రైతులకు పట్టాలిస్తున్నామని అన్నారు. తెలంగాణ విభజన హామీలైన ఉక్కు పరిశ్రమ, గిరిజన యూనివర్సిటీ, కోచ్ ఫ్యాక్టరీని ఏ ర్పాటు చేయడంలో బిజెపి వైఫల్యం చెందిందని అన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణలో పోడు రైతులందరికీ పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.
మతోన్మాద ఫాసిస్ట్ బిజెపిని తరిమికొట్టండి
సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు జి నాగయ్య పిలుపు
కేంద్రంలో బిజెపి అవలంభిస్తున్న మతోన్మాద ఫాసిస్టు విధానాలను ఎండగట్టాలని ఆ పార్టీ నేతలను ప్రశ్నించాలని ఓడించాలని తరిమికొట్టాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు జీ.నాగయ్య పిలుపు నిచ్చారు.జనచైతన్యయాత్రలో నాగయ్య మాట్లాడారు. బిజెపి హయాంలో ప్రభుత్వ రంగం మొత్తం నాశనం అయిందన్నారు. బిజెపి హయాంలో ప్రభుత్వ రంగ సంస్థలను కార్పరేటు పరం చేస్తున్నారని భవిష్యత్తులో రిజర్వే షన్లకు భంగం కలుగుతుందన్నారు. తెలంగాణ విభజన హా మీలైన ఉక్కు పరిశ్రమ, కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివ ర్సిటీలను ఏర్పాటు చేయడంలో బిజెపి తీవ్రంగా విఫల మైం దన్నారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటులో భాగంగా బైలాడీలా జిల్లా నుంచి బొగ్గు తీసుకువచ్చి పరిశ్రమ ఏర్పాటు చేస్తామని చెప్పారని వాస్తవానికి అక్కడి బొగ్గును ఆదానికి రాసి ఇచ్చేశారని విమర్శించారు. ఉక్కు పరిశ్రమ ఏర్పాటులో బిజెపికి చిత్తశుద్ధి లేదన్నారు. బిజెపి హయాంలో అన్ని వస్తు వుల ధరలు పెరిగి పోయాయి అని అన్నారు. గ్యాస్ పెట్రో ల్ నిత్యవసర సరుకుల ధరలు ఆకాశాన్నంటాయని అన్నారు. జిల్లాలో 5000 ఎకరాల ప్రభుత్వములు ఉన్నాయని అం దులో సిపిఎం సిపిఐ ఆధ్వర్యంలో కేవలం 400 ఎకరాల్లో మాత్రమే గుడిసెలు వేశారని మిగిలిన 4600 ఎకరాల భూమి ఎక్కడ ఉందో కలెక్టర్ ఆర్డివో తహసిల్దార్ వెలికితీ యాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూమిలో పేదలు వేసు కున్న ఇండ్లకు పట్టాలు ఇవ్వాలని డబుల్ బెడ్ రూమ్ గృహా లు ఇవ్వాలని ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. బిజెపి ఆవాస్ యోజన కింద లక్ష ఇల్లు ఇచ్చామని చెబుతు న్నారని ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని విమర్శించారు. పేదల గృహాలకు బిజెపి 10 లక్షలు బీఆర్ఎస్ ఐదు లక్షలు ఇస్తే 15 లక్షలతో పేదలకు ఇల్లు కట్టుకోవచ్చని అన్నారు. ప్రచారానికి వచ్చే బిజెపి నేతలను నిలదీయాలని ప్రశ్నించాలని నాగయ్య పిలుపు నిచ్చారు.
అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు
బిజెపి హయాంలో తెలంగాణలో అన్ని వర్గాల ప్రజల కు అన్యాయం జరుగుతుందని బిజెపి ప్రభుత్వంపై ప్రజలు తిరగబడాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పో తినేని సుదర్శన్ రావు పిలుపు నిచ్చారు. జన చైతన్య బహి రంగ సభలో ఆయన మాట్లాడారు. బిజెపి పాలలో రైతులకు కార్మికులకు కర్షకులకు మహిళలకు ఉద్యోగులకు అన్ని వర్గా ల ప్రజలకు నష్టం వాటిల్లుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రం లో ఒక అవకాశం ఇవ్వమని బండి సంజరు అంటున్నాడని ఇస్తేవారు ఏం చేస్తారని ప్రశ్నించారు. బిజెపి మళ్లీ అధికారం లోకి వస్తే దళిత గిరిజన రిజర్వేషన్లను రద్దు చేసేందుకు కుట్ర చేస్తుందని విమర్శించారు. బిజెపిని తెలంగాణలో ఒం టరి చేసేందుకు ఏప్రిల్‌లో సిపిఎం సిపిఐ ఆధ్వర్యంలో ఉ మ్మడి కార్యచరణ ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. బిజెపికి వ్యతిరేకంగా ప్రజలు చైతన్యం కావాలని బిజెపి ప్ర మాదాన్ని ప్రజలు గుర్తించాలని కోరారు. సిపిఎం జన చై తన్య యాత్ర ద్వారా బిజెపి ప్రమాదాన్ని ప్రజలకు వివ రించేందుకు ముందుకు వచ్చినట్లు తెలిపారు.
మహబూబాద్ జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్ మా ట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మహబూబాబాద్ జిల్లా అత్యధికంగా గిరిజనులు 40% ఉన్న జిల్లా వెనుకబడిన జిల్లా ఉందని అదేవిధంగా ఉక్కు కర్మాగారం నిర్మించాలని బిజెపి ప్రభుత్వం బయ్యారం ఏర్పాటు చేస్తారని ఇప్పటివరకు రాయి కూడా కదిలించిన పరిస్థితి ఏర్పడిందని, మహబూ బాద్ పట్టణంలో కమ్యూనిస్టుల ద్వారా మూడు నుంచి నా లుగు వేల మంది పేదలకు ఇళ్ల స్థలాలకు పంపిణీ చేయడం జరిగిందని, భూ రక్షణ,భూ పోరాటం, భూప్రక్షాళన,పోడు పట్టాలు కోతుల బెడద, విద్యా-వైద్య, స్టేడియం, ఆడిటో రియం, సమస్యలు మహబూబాబాద్ జిల్లా ప్రజలకు సమస్య లుగా ఉన్నాయని వాటిని తీర్చాలని కోరారు.
జన చైతన్య యాత్రలో పాలడుగుల భాస్కర్ మాట్లాడు తూ కమ్యూనిస్టుగా మీ అందరికి తెలుసు దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలు అయి నప్పటికీ నిరుద్యోగ సమస్య తీరుస్తానని సంవత్సరానికి రెం డు కోట్ల కోట్ల ఉద్యోగాలు ఇస్తానని ప్రతీ సంవత్సరం ఉద్యో గాలన్నిటిని నిర్వీర్యం చేసి నిరుద్యోగాన్ని పెంచి వేసి దేశంలో పరిశ్రమలు మూసివేశారు. భారతదేశం మొత్తాన్ని నేను చారు వాళ్ళని చెప్పి దేశంలో ఉన్నటువంటి సంపాద మొత్తా న్ని చారు వాళ్ళు అమ్మినట్టు ప్రపంచ దేశాలకు అమ్మే పరి స్థితి ఏర్పడిందని ఆయన అన్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ మూతపడే అవకాశం ఉందని, బొగ్గు గనులు మొత్తాన్ని అదా నికి కట్టబెట్టే ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో ప్రతిపక్షాలు పసిగట్టే ప్రయత్నం చేస్తుండగా నిలిపివేశారు. అధికారం రాకముందుకు బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ కాజీపేటలో కోచ్ ఇప్పటివరకు వాటిపై ఉసెత్తని కేంద్ర ప్రభుత్వం దేశ సంపద మొత్తాన్ని గౌతమ్ అదానికి కట్టబెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని, ఎన్ని సంస్థలని అడ్డదారిలో కొనుగోలు చేసిన అదానిని అదుపు చేసే ప్రయత్నం కేంద్రం ప్రోత్సహిస్తుంది తప్పా అదుపు చేసే ప్రయత్నం చేయట్లేదని వారు అన్నారు. కులం జాతి మతం పేరు మీద చిచ్చులు రెపి ముస్లిం క్రిస్టియన్లను దేశం నుంచి తరిమేలనే ప్రయత్నం చేస్తున్నదని బిజెపిని దూయ్యబట్టారు.
సిపిఐ జిల్లా కార్యదర్శి బి.విజయ సారధి మాట్లాడుతూ బిజెపి అధికారంలోకి వచ్చిన ఎనిమిదేళ్ల కాలంలో దేశంలో సంక్షోభం పెరిగిందని అన్నారు.పేదలకు కూడు గూడు అం దించడమే మార్సిస్ట్ సిద్ధాంతమని అన్నారు. బిజెపిని ఓడిం చడం కోసం ఐక్యం కావాల్సిన అవసరం ఉందని ప్రజలు అదే కోరుకున్నారని అన్నారు. బిజెపి ప్రభుత్వం ఓడరేవులను రైల్వే, ఎల్ఐసి, బ్యాంకులను కార్పొరేట్ వ్యక్తులకు దారదత్తం చేయడం ద్వారా రిజర్వేషన్లకు తూట్లు పొడుస్తుందని విమ ర్శించారు. వరంగల్ జిల్లాలో ఉన్న అజన్ జాహి మిల్లు, బిల్ట్ ఫ్యాక్టరీ మూతపడ్డాయని అన్నారు. దేశంలో బిజెపి ఆర్థి క విధానాలు మతోన్మాద విధానాల మూలంగా మత ఘర్ష ణలు జరిగి ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఐక్యత కోసం ఏప్రిల్‌లో సమావేశం నిర్వ హిస్తున్నట్లు తెలిపారు.
ఈ సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మల్లు లక్ష్మి, సిపిఎం నాయకులు సిహెచ్ రంగన్న, పి రాజారావు, సిపిఎం మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సుర్ణపు సోమయ్య, శెట్టి వెంకన్న, గునిగంటి రాజన్న, ఆకుల రాజు, సిపిఎం నాయకులు వంగూరి రాములు, అల్వాల వీరన్న, శ్రీనివాస్, ఆంగోత్ వెంకన్న, గాడిపెళ్లి ప్రమీల, కందునూరి కవిత, బానోతు సీతారాం నాయక్, మార్తినేని పాపారావు, మండ రాజన్న, సమ్మెట రాజమౌళి, కుర్ర మహేష్, కుంట ఉపేందర్, పొన్నం అశోక్, డి రామ్మూర్తి , గునిగంటి మోహన్ , బొల్లం అశోక్, హరినాయక్, మల్లేటి కోటయ్య, బీఆర్ఎస్ నాయకులు, పిఎ సిఎస్ చైర్మన్ నాయిని రంజిత్, నాయకులు మారినేని రఘు, లూనావత్ అశోక్, తేల శ్రీనివాస్, జి రాజశేఖర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.