Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గార్ల
పంటల కోత అనంతరం పంట ఉత్పత్తులు దెబ్బతినకుండా రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మహబూబాబాద్ డివిజన్ ఎడిఎ లక్ష్మి నారాయణ అన్నారు. గత రెండు రోజుల పాటు మండలంలో కురుస్తున్న వర్షాల కారణంగా దెబ్బతిన్న పోగాకు, మొక్కజొన్న పంటలను శుక్రవారం మండల వ్యవసాయ అధికారి కె.రామారావుతో కలిసి క్షేత్ర స్దాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా వర్షాల కారణంగా పంటలు దెబ్బతినకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను రైతులకు సూచించారు. వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలను ప్రాథమికంగా పరిశీలిస్తున్నామని పరిశీలిన అనంతరం నివేదికను జిల్లా అధికారులకు అందజేస్తామని చెప్పారు. పంటలను పరిశీలించిన వారిలో ఎఇవో రాజశేఖర్ తదితరులు ఉన్నారు.