Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బయ్యారం
జిల్లా కేంద్రంలో జరిగే సీపీఎం జన చైతన్య యా త్రకు మండలం నుంచి నాయకులు బయలుదేరి వె ళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశ, రాష్ట్ర ప్రజలను చైతన్యం చేయడం కోసం సీపీఎం ఆధ్వర్యం లో జన చైతన్య యాత్ర శుక్రవారం ప్రారంభమైంది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో వేలాది మందితో జరుగు బహిరంగ సభను ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
సీపీఎం మండల కార్యదర్శి తిలక్ ఆధ్వర్యంలో...
నెల్లికుదురు : మండల కేంద్రం నుండి సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో జనచైతన్య యాత్రకు 50 ద్విచక్ర వాహనాలు 10 ఆటోలలో కార్మికులను పార్టీ కార్యకర్త లను తరలించినట్లు సీపీఎం మండల కార్యదర్శి పెరు మాండ్ల తిలక్ బాబు తెలిపారు. మండల కేంద్రంలో జన చైతన్య యాత్ర వస్తున్న క్రమంలో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికి వారితోపాటు శుక్రవారం మహబూబాద్ బహిరంగ సభకు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రా జ్యాంగాన్ని పరిరక్షిద్దాం దేశాన్ని పరిరక్షిద్దాం అనే నినా దంతో ప్రజల్లోకి తీసుకెళ్లి ఆగాన కల్పించినట్లు తెలి పారు. ప్రజాస్వామ్యం లౌకికతత్వం ఫెడరలిజం సా మాజిక న్యాయ పరిరక్షణకై లక్ష్యసాధన ముందుకెళ్లా లని, బీజేపీ మతోన్మాద కార్పోరేట్ విధానాలపై పో రాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్య క్రమంలో సీఐటీయూ మాజీ మండల కార్యదర్శి పెరుమాళ్ళ బాబుగౌడ్, తోట యాకయ్య, పెరుమాళ్ళ పుల్లయ్య, వంద మంది కార్యకర్తలు బయలుదేరారు
యాత్రకు భారీగా తరలిన సీపీఎం శ్రేణులు
గార్ల : కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరి స్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలలోకి తీసుకు వెళుతూ ప్రజలను చైతన్యవంతం చేయడానికి సీపీ ఎం అధ్వర్యంలో జనచైతన్య యాత్ర చేపట్టిందని సీపీ ఎం మండల కార్యదర్శి కందునూరి శ్రీనివాస్ అన్నా రు. మానుకోట జిల్లా కేంద్రంలో జన చైతన్య యాత్ర బహిరంగ సభకు శుక్రవారం మండల శ్రేణులు పలు వాహనాలలో ఎర్రచొక్కాలు, ఎర్రచీరలు ధరించి ప్రద ర్శనగా వెళ్లారు. మండలంలోని గోపాలపురం, పినిరె డ్డిగూడెం, ముత్తితండా, నగరం, సీతంపేట, బుద్దా రం, గార్ల, ముల్కనూరు గ్రామాల నుండి వాహనాల ర్యాలీని శ్రీనివాస్ జెండాను ఊపి ప్రారంభించారు. మానుకోట తరలిన వారిలో సీపీఎం జిల్లా,మండల కమిటీ సభ్యులు కందునూరి కవితా, భూక్య హరి, వి.వెంకటేశ్వర్లు, ఎ.సత్యవతి, కె.ఈశ్వర్ లింగం, జి. రాజారావు, బి.లోకేశ్వరావు, ఎ.వీరాస్వామి, ఐ.గోవిం ద్, బి.ఉపేందర్ రెడ్డి, కె.ఈశ్వర్ లింగం, ఎల్లయ్య, నాగమణి,శ్రీను,కార్యకర్తలు ఉన్నారు.