Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హనుమకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్
నవతెలంగాణ-సుబేదారి
బ్యాంకులు సకాలంలో ఋణాలు అందించి ప్రభుత్వ లక్ష్యాలను సాధించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ బ్యాంకర్లకు ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ మీ టింగ్ హాలులో జిల్లా స్థాయి బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీ సమావేశానికి జిల్లా కలెక్టర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బ్యాంకర్లను ఉద్దేశించి మా ట్లాడుతూ పంట రుణాల కింద రూ.1432 కోట్లు, అనుబంధ రంగాల రుణాల కింద రూ.400కోట్లు మొత్తం రూ.4444.46 కోట్ల లక్ష్యంగా నిర్దేశించినట్లు తెలి పారు. రైతులకు గత డిసెంబర్ వరకు రూ.1014.41 కోట్లు వ్యవసాయ పంట ఋణాలుగా అందచేయడం జరిగిందన్నారు. వ్యవసాయ దీర్ఘకాలిక ఋణాలుగా రూ.995.08 కోట్లతో మొత్తంగా వ్యవసాయ రంగానికి రూ.2131.18 కోట్లు బ్యాంకుల ద్వారా రుణాలను ఇవ్వడం జరిగిందని తెలిపారు. వ్యవసాయ ఋణాల ను సకాలంలో అందించి లక్ష్యాలను సాధించాలని, రైతులు పంట ఋణాలు సకా లంలో చెల్లించేలా అధికారులు క్షేత్ర స్థాయిలో శ్రద్ధ కనబరచాలని ఆదేశించారు. సూక్ష్మ ఋణాలకింద సూక్ష్మ,చిన్న,మధ్య స్థాయి పరిశ్రమలకుగాను రూ.1156.83 కోట్లు ఇవ్వడం జరిగిందని, విద్యాఋణాలుగా రూ.16.07కోట్లు, గృహ ఋణా లుగా రూ.39.55 కోట్లు అందించడం జరిగిందని, అంతే కాకుండా ప్రాధాన్యతా రంగాలకు రూ.3375.59 కోట్లు అందించడం జరిగిందని తెలిపారు. .జిల్లాలో మహిళా సంఘాలకు రూ.469 కోట్ల ఋణాలు లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిం దని, దీనిలో ఇప్పటి వరకు సంఘాలకు గాను 349 కోట్లు అందించి 74 శాతం లక్ష్యాన్ని సాధించడం జరిగిందని అన్నారు.
అర్హత ఉన్న సంఘాలకు ఋణాలు వెంటనే అందించాలని, రెన్యువల్ లో ప్రా సెసింగ్ ఫీజు లేకుండా చూడాలని తెలిపారు. మెప్మా క్రింద 476 సంఘాలకు గాను రూ.25 కోట్ల లక్ష్యానికి గాను రూ.215 కోట్లు ఋణాలుగా అందించడం జరిగిందన్నారు. వీధి వ్యాపారులకు అందించే రూ.20 వేల ఋణానికి సంబం ధించి జిల్లాలో 6134 వీధి వ్యాపారులకు ఇంకా 1866 విధి వ్యాపారులు కు లో న్ పెండింగ్ ఉందని, వీటిలో ప్రధాన బ్యాంకులైన ఎస్బిఐ, యూనియన్ బ్యాంక్ లు కూడా ఉండటం శోచనీయమన్నారు. సత్వరమే వారికి లోన్ మంజూరు చే యాలన్నారు. పీఎంఈజీపీ కింద 46 యూనిట్లు మాత్రమే మంజూరు చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసారు. విధులలో అలక్ష్యం వీడాలని ఆమె హితావు ప లికారు. అటల్పెన్షన్ యోజనపథకం కింద 41వేల పెన్షన్లు ఎన్రోల్ అయ్యా యన్నారు. ప్రధాన మంత్రి జీవన జ్యోతి యోజన పథకం కింద 74,648 మంది సభ్యులకు ఇన్సూరెన్స్ కల్పించినట్లు తెలిపారు. కిసాన్ క్రెడిట్ పతాకాన్ని ప్రతి లబ్ది దారుడు సద్వినియోగం చేసుకొనే విధంగా అధికారులు చర్య తీసుకోవాలని ఆదేశించినారు. బ్యాంకు అధికారులు తమ బ్యాంకు ప్రగతి నివేదికలు ప్రతి 15 రో జులకు ఒక్కసారి ఖచ్చితంగా సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ సమావేశంలో ఎల్డిఎం శ్రీనివాస్, నాబార్డ్ డిడిఎం చంద్రశేకర్, అనిల్ క ల్బోరే, జిల్లా అధికారులు శ్రీనివాస్, ఇండిస్టీస్ జిఎం హరిప్రసాద్, శ్రీనివా స్, మా ధవిలత, ప్రేమకళా రెడ్డి, రామనర్సయ్య, ఫిషరీస్ ఆఫీసర్ విజయభారతి, మెప్మా పీడి భద్రు, సురేష్ బాబు, శ్రీధర్ రెడ్డి,కెనరా బ్యాంక్ రంజీత్ కుమార్ ఇతర బ్యాంక్ ల ,మేనేజర్లు పాల్గొన్నారు.