Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వేధించిన 11 మందిపై కేసు నమోదు
- సీపీ స్పందనపై బాధిత కుటుంబ సభ్యుల హర్షం
నవతెలంగాణ-నర్సంపేట
భూమిని విక్రయించాలని ఒత్తిడి చేస్తూ వేధింపు చర్యలకు పాల్పడిన 11 మందిపై కేసు నమోదు చేసి అండగా నిలిచినందుకు ఓ రైతు కుటుంబం హర్షం వెలుచ్చుతూ సీపీ రంగనాథ్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. శుక్రవారం తెలంగాణ అమరవీరుల స్తూపం ఎదుట పట్టణానికి చెందిన నాడెం వీరస్వామి, రాజ్యలక్ష్మీ దంపతులు సీపీ చిత్ర పటానికి పాలాభిషేకం చేయడంపై చర్చనీయానీంశమైంది. బాధిత రైతు వీరస్వామి మాట్లాడుతూ నర్సంపేట శివారులో తనకు చెందిన 2 ఎకరాలలో 20 గుంటల భూమిని 2018లో ఏనుగల్ తండాకు చెందిన బ్యాంకు ఉద్యోగి భానోతు అనిల్ నాయక్ భార్యకు అతని సోదరుడు సునిల్ నాయక్‌కు విక్రయించానని, హద్దులు కూడా ఏర్పరచి అప్పగించానని తెలిపాడు. మిగతా ఉండబడిన తన భూమిలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నానని ఇటివల మరో 10 గుంటల భూమిని కూడా అమ్మకం చేయాలని తనను ఒత్తిడి చేశారని చెప్పారు. తాను అమ్మకం చేయనని చెప్పినా అనిల్ నాయక్, సునిల్ నాయక్ మరికొందరు కలిసి తరుచూ తనను వేధిస్తుండగా మనోవేధనకు గురి అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశాడు. దాడికి యత్నించి పొలాన్ని ధ్వంసం చేసి హద్దు రాళ్లను తొలగించారని వాపోయాడు. తాను ప్రాధేయడినా వినిపించుకోలేకపోగా కులం పేరుతో దుషించానని ఫిబ్రవరి 27న పోలీసు స్టేషన్లో తప్పుడు కేసులు పెట్టారని తెలిపాడు. ఇట్టి విషయంపై విచారణ చేసి తానకు న్యాయం చేయాలని పోలీసులను ప్రాధేయపడినా ఫలితం లేకుండా పోయిందని తెలిపారు. ఈ విషయంపై సీపీ రంగనాథ్‌ను ఆశ్రయించి తనకు జరిగిన అన్యాయం పట్ల ఫిర్యాదు చేశానని దీనిపై వెంటనే సీపీ స్పందించి విచారణ చేపట్టారన్నారు. తనపై నమోదు చేసిన అట్రాసిటీ కేసు తప్పుడుగా పరిగణించారని, వేధించిన 11 మందిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని సీపీ రంగనాథ్ పోలీసు అధికారులను ఆదేశించారని చెప్పారు. తనకు జరిగిన తక్షణమే స్పందించిన సీపీ రంగనాథ్‌కు రైతు వీరస్వామి అతని భార్య రాజ్యలక్ష్మీ కృతజ్ఞతలు చెప్పారు. కాగా రైతు కుటుంబం సీపీ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసి మిఠాయిలు పంపిణీ చేయడంపై పలువురు చర్చించుకోవడం కన్పించింది.