Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య
నవతెలంగాణ-వరంగల్
ఎస్సీ,ఎస్టీలపై జరుగుతున్న అన్యాయాలను అరి కట్టేందుకు ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని ప్రభుత్వం తీసుకు వచ్చిందని ఈ చట్టాన్ని జిల్లాలో సమర్థవం తంగా అమలు చేసేందుకు అధికార యంత్రాంగం చ ర్యలు చేపట్టిందని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులపైన శుక్రవారం కలెక్టరే ట్లోని కాన్ఫెరెన్స్హాల్లో కలెక్టర్ అధ్యక్షతనజిల్లా స్థా యి విజిలెన్స్, మానిటరింగ్ సమావేశం నిర్వహిం చా రు.ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ లకు అన్యాయం జరిగినప్పుడు వెంటనే స్పందించి ఎఫ్ఐఆర్ నమోదు చేసి త్వరగా చార్జిషీట్ నమోదు చేయాలని పోలీస్ శాఖ అధికారులకు తెలిపారు.అదే విధంగా కేసులునమోదై నష్టపరిహారం కోసం ఎదు రు చూస్తున్న బాధిత ఎస్సీ,ఎస్టీలకు న్యాయం జరిగి త్వరగా నష్టపరిహారం అం దించేలా చర్యలు చేపట్టాల న్నారు.వరంగల్ జిల్లా పరి ధిలో 27కేసులు పెండింగ్ లో ఉన్నాయని. ఎలాంటి దర్యాప్తు కూడాత్వరగా పూర్తి కావాలన్నారు. నేరా లకు పాల్పడిన వారు ఎ ట్టి పరిస్థితిలో కేసుల నుం చి తప్పించుకోకుండా చూసి వారికి చట్ట పరిధిలో తగిన శిక్ష పడేలా అధికారులు చర్యలు తీసుకోవాల న్నారు. ప్రతీనెల 30న జరిగే సివిల్స్రైట్స్ డేకి సం బంధించి అందరికి సమాచారం అందించాల న్నా రు. ఈ సమావేశంలో సెంట్రల్ డీసీపీ బారి, డిసిపి ఈస్ట్ జోన్ వరంగల్ కరుణాకర్, అగ్రికల్చర్ జే డీ ఉ షాదయాల్, యూత్ స్పోర్ట్స్ ఆఫీసర్ ఇందిర, బీసీ వెల్ఫేర్ అధికారి శంకర్‌నాయక్, కమిటీ సభ్యులు బి ర్రు మహేందర్, మాంకాలయాదగిరి, పాలకుర్తి విజ రుకుమార్, భూక్య హుస్సేన్, నమిండ్ల చినస్వామి, సిహెచ్ సమ్మయ్య,కే శోభారాణి, వాసం సాంబయ్య శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.