Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇన్విజిలేటర్ అత్యుత్సాహంతో ఘటన
- రెండు గంటల పాటు జీజేసీ ముందు ఆందోళన
నవతెలంగాణ-హసన్‌పర్తి
పరీక్ష వ్రాయనివ్వలేదని విద్యార్థిని ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన ఘటన శుక్రవారం హసన్‌పర్తి మండలంలోని చోటు చేసుకుంది. ఇన్విజిలేటర్ అ త్యుత్సాహమే ఘటనకు పాల్పడినట్లు స్థానికులు తెలి పారు. రెండుగంటల పాటు హసన్‌పర్తి ప్రభుత్వ జూ నియర్ కళాశాల ఎదుట ఆందోళన చోటు చేసుకుం ది. వివరాల్లోకి వెళితే మండలంలోని ఎర్రగట్టుగుట్ట ఎన్ఆర్ఐ కళాశాలకు చెందిన ఇంటర్ మొదటి సం వత్సరం విద్యార్థినీ ఫౌజియా (16) శుక్రవారం హస న్పర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంగ్లీష్ పరీక్ష రాసేందుకు హాజరైంది. వికలాంగురాలైన విద్యార్థినీ ఫౌజియా పరీక్ష రాస్తుండ గా అక్కడే విధులు నిర్వహి స్తున్న ఇన్విజిలేటర్ చూసి రాస్తున్నావంటూ పరీక్ష పే పర్ తీసుకొని వేధింపుల కు గురిచేసింది. విద్యార్థిని ఎంతనచ్చజెప్పినా వినకుం డా పరీక్ష ముగిసే ముందు ఇన్విజిలేటర్ పరీక్ష పేపర్ అన్సర్ షీట్లో కొట్టివేసి ఇచ్చారని తనకు అన్యాయం జరిగిందంటూ కన్నీరుమున్నీరుగా విలపించింది. అ యితే అక్కడే చీఫ్సుపరింటెండెంట్గా విధులు నిర్వ హిస్తున్న ప్రిన్సిపాల్ సునిత ఇంకా నిన్ను మాస్‌కాపీ యింగ్ కింద బుక్‌చేసి డిబార్ చేయనందుకు సంతో షించాలని ఇన్విజేటర్కు సపోర్టు చేసినట్లు బాధిత వి ద్యార్థిని తెలిపింది. అయితే మాస్ కాపీయింగ్‌కు పా ల్పడినట్లు గుర్తిస్తే సంబంధిత ఆదారాలతో విద్యార్థినీ పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉండగా నిబంధ నలకు విరుద్దంగా ఆ విద్యార్థిని పరీక్ష పేపర్ తీసుకొ ని కాలయాపన చేయడమే కాకుండా ఎలాంటి ఆధా రాలు లేకుండా విద్యార్థినీకి అన్యాయం చేయడంపై ఎన్ఆర్ఐ కళాశాల యాజమాన్యంరాజుకుమార్, గట్ట య్యలు చీఫ్ సుపరింటెండెంట్ను ప్రశ్నించారు. అక్క డ జరుగుతున్న విషయంపై మనస్థాపం చెందిన వి ద్యార్థిని ఫౌజియా పదేపదే ఆత్మహత్యాయత్నానికి పా ల్పడడంపై కళాశాల యాజమాన్యం, ప్రభుత్వ కళాశా ల ఇన్విజిలేటర్లు, స్థానిక ఏఎస్సై జనార్థన్‌లు ఆందోళ నకు గురయ్యారు.
పరిస్థితి విషమిస్తుందని గ్రహించిన జిల్లా పరీక్షల నియంత్రణ అధికారులు సమస్య సద్దుమణి గేందుకు ప్రయత్నం చేశారు. నిబంధనలకు విరుద్దం గా ప్రవర్తించి విద్యార్థినీకి అన్యాయం చేసిన ఎగ్జామ్ చీఫ్ సుపరింటెండెంట్ను విదుల నుంచి తొలగించి ఆమె స్థానంలో మరొకరిని నియమించాలని విద్యార్థు ల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు జిల్లా ఉన్నతాధికారులను డిమాండ్ చేశారు. అనంత రం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విద్యార్థినీ ఫౌజి యాను తల్లిదండ్రులకు అప్పగించడంతో ఉత్కంఠకు తెరపడింది.