Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రాయపర్తి
'ప్రజల వద్దకు ఆర్టీసీ' అనే కార్యక్రమంతో ఆర్టీసీ సేవలను గ్రామస్థాయి వరకు విస్తృతంగా విస్తరించడం జరుగుతుందని టీ ఎస్ ఆర్టీసీ వరంగల్-1 డిపో మేనేజర్ పి.శ్రీనివాస్‌రావు అ న్నారు. శుక్రవారం మండలంలో ని కొండూరులో సర్పంచ్ కర్ర సరితరవీందర్రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన స మావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రైవేటు వాహనాల్లో ప్రయాణం చేస్తే ప్రమా దాలు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని హితవు పలికారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ల అనుభవజ్ఞులై ఉంటారని సురక్షితంగా గమ్యస్థానానికి చేరుస్తారని తె లిపారు. ఆర్టీసీ బస్సు ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందిం చేందుకు సిద్ధంగా ఉన్నట్టు వివరించారు. ఆర్టీసీలో వికలాంగులకు 50 శాతం చార్జీ రాయితీతో బస్సులో ప్రయాణించవచ్చని పేర్కొన్నారు. స్కూలు పిల్లలకు ఫ్రీ బస్సు పాస్‌లు, కాలేజీ పిల్లలకు రాయితీతో కూడిన బస్సు పాస్ సౌకర్యం కల్పిం చడం జరుగుతుందన్నారు. అడ్వాన్సు లేకుండా పెళ్లిళ్లకు శుభకార్యాలకు బస్సుల ను అద్దెకు ఇవ్వడం జరుగుతుందన్నారు. తిరుమల దైవదర్శనానికి ఆర్టీసీ బస్సు టికెట్లను బుక్ చేసుకుంటే దర్శన టికెట్లు పొందవచ్చని, సీతారాముల కళ్యాణానికి రూ.116 రూపాయలు చెల్లిస్తే ముత్యాల తలంబ్రాలు మీ ఇంటి వద్దకే తెచ్చి ఇస్తా మని వివరించారు. ఈ సమావేశంలో గ్రామస్తులు, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.