Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేటీ బహిరంగా సభను విజయవంతం చేయాలి
- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు జె వెంకటేష్
నవతెలంగాణ-భూపాలపల్లి
కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుందని బిజెపి మతోన్మాద శక్తులను కూల్చివేయాలని సీపీ(ఎం )రాష్ట్ర కమిటీ సభ్యులు జే వెంకటేష్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సిపిఐ(ఎం) జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసన విలేకరుల సమావేశానికి సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి బందు సాయిలు అధ్యక్షత వహించగా వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు... కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దేశ సంపదనంతా అదానీ, అంబానీలకు కట్టబెడుతూ, దేశ ప్రజలపై భారాలను మోపుతూ దేశంలో 23కోట్ల మందిని పేడులుగా చేశారన్నారు. దేశంలో దళితులు, గిరిజనులపై దాడులు చేపిస్తూ, కులాలు, మతాల పట్ల చిచ్చులు పెట్టడంతో పాటు బీజేపీ ఎంఎల్ఎలు, ఎంపీ లు, మంత్రులు తినేతిండిపై, వేసుకునే బట్టలపై అదిపత్య చిచ్చుపెట్టి దేశాన్ని మతోన్మాద దేశంగా మార్చాలనే వికత రాజకీయ క్రీడ ఆడుతుందన్నారు. దేశం మొత్తం మతోన్మాద బీజేపీ కోరల్లో చిక్కుకొని విలవిలాడుతుందన్నారు. సామా జిక న్యాయం కోస తరాతరాలుగా పోరాడి సాధించుకున్న రిజర్వేషన్ల నీరుగార్చేందుకు కేంద్ర ప్రభుత్వం పూనుకుంటు న్నదన్నారు. దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట పరం చేయడం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీలు పూర్తిగా తమ రిజర్వేషన్లను కోల్పోయే పరిస్థితి వచ్చిందన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నిత్యావసర సరుకులు, పెట్రోల డిజీల్, వంట నూనె, వంట గ్యాస్, ధరలు మూడింతుల పెరి గాయన్నారు. దానికి తోడు ప్రభుత్వ రంగ సంస్థలు ఎల్బీసీ, ఎయిర్ పోర్టు, రైల్వేను, సింగరేణిని ప్రైవేట్ పరం చేసి పేద నోట్లో మన్ను కొట్టిన నీచమైనా ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అన్నారు. తెలంగాణకు రైల్వేకోచ్ ప్యాక్టరీ ఇస్తానని, దానికి 40వేల మంది ఉద్యోగులను కూడ కెటాయిస్తానని చెప్పి మాట తప్పారన్నారు. నేడు దేశంలో నిరుద్యోగ వ్యవస్థ 70 ఏండ్లు వెనుబడి పోయిందన్నారు. పరిపాలించడంలో ప్రపంచంలో ఫెయిల్ అయినవారు 5 మంది ఉన్నారనీ, వారిలో ఒక్కరు ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఇప్పటికైనా దేశ ప్రజలు బీజేపీ నిజా స్వరూపాలను తెలుసుకొని దేశంలో బీజేపీని గద్దెదించేందుకు రాజకీయ పార్టీలకు అతీతంగా ఒక్కటై పని చేయాలని పిలుపునిచ్చారు. అదేవిదంగా ఇండ్లు లేని నిరుపేదలకు 120 గజాల ఇంటి స్థలాన్ని, జర్నలి స్టులకు సొంతింటి కళను నెరవేర్చాలన్నారు. -నేటీ బహి రంగ సభను విజయవంతం చేయాలి. బీజేపీ చేపడుతున్న ప్రజా వ్యతిరేఖ, మతాన్మాద, కార్పోరేట్ విధానాలకు వ్యతి రేఖంగా సంభ్రమం, మత సామారస్యం, ప్రజా స్వామ్యం, సామాజీక న్యాయం సాధించడం కోసం మార్చి 17 నుండి సీపీఎం పార్టీ ఆద్వర్యంలో హన్మకొండలో ప్రజా చైతన్య యాత్ర ప్రారంభమైందని, ఈ యాత్ర నేడు జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చేరుకోని, జిల్లా కేంద్రంలో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో భారీ బహీరంగా ఏర్పాటు చేయడం జరు గుతుందన్నారు. ఈ యాత్ర హన్మకొండ, ములుగ, భూపాల పల్లి, కొత్తగూడం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలో ఈనెల 29వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. నేడు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని నిర్వ హించే భారీ బహీరంగా సభకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేణి వీరభద్రం, భూపాలపల్లి కేంద్ర కమిటీ సభ్యులు జి నాగయ్య,రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, పోతినేని సుదర్శన్, మల్లు లక్ష్మి, సీతారాములు పాలడుగు భాస్కర్, తదితరులు హజరవుతున్నారు. ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు దామెర కిరణ్, కంపేటీ రాజయ్య, వి. రాజయ్య, శ్రీకాంత్, లక్ష్మణ్, శ్రావణ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.