Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మట్టెవాడ
వరంగల్ తూర్పు నియొజకవ ర్గంలోని కాంగ్రెస్ మైనారిటీ నాయ కుడు ఫక్రోద్దీన్ షేక్ శుక్రవారం ఎ మ్మెల్యే నన్నపునేని నరేందర్ సమ క్షంలో శివనగర్‌లోని ఎమ్మెల్యే నివా సంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ లీడర్ క్యాడర్ లేని పార్టీ కాంగ్రెస్ అని కాంగ్రెస్ కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీని తిరస్కరిస్తున్నారన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మేము చేస్తున్న అభివద్ధికి ఆకర్షితులై పార్టీలో చేరడం సంతోషకరమన్నారు. కార్య కర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని ఫక్రోద్దీన్ కు ఎల్లవేళలా అందుబా టులో ఉంటానని హామీ ఇచ్చారు.ఫక్రొద్దిన్ మాట్లాడుతూ తూర్పు లో ఎమ్మెల్యే చేస్తున్న అభివద్ధి పనులు చూసి గత నాయకులు పట్టించుకోకుండా వాడుకొని వదిలేసారనీ, కాని ఎమ్మెల్యే నరేందర్ మంచితనం నియోజకవర్గం లో చేస్తున్న అభివృద్ధిని చూసి బిఆర్ఎస్లో చేరుతున్నానని ఆయన పేర్కొన్నారు .ఈ కార్యక్ర మంలో ఫకిర్ల కుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఉల్ఫాత్,ముస్లిం మైనారిటీ నాయకు లు, కార్యకర్తలు పాల్గొన్నారు.