Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎల్కతుర్తి
గ్రూప్-1 పరీక్షలను వెంట నే రద్దు చేయాలని బీఎస్పీ హు స్నాబాద్ నియో జకవర్గం ఈసీ మెంబర్ దాట్ల నరేష్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మా ట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్ర భుత్వం టీఎస్పీఎస్సీ ద్వారా నిర్వహించిన గ్రూపు-1 ప్రిలిమ్స్ పరీక్షను తక్షణమే రద్దు చేయాలని, పేపర్ లీకులను సీబీఐ ద్వారా విచారణ జరిపించాలని, తక్షణమే టీఎస్పీఎస్సీ ఛైర్మెన్ను తొలగించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువతి, యువకుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న బీఆర్ఎస్ పార్టీ, తక్షణమే టీఎస్పీ ఎస్సీ అన్ని పరీక్షలను రద్దుచేసి, మళ్ళీ నిర్వహించాలని కోరారు. శాంతియుతంగా నిరుద్యోగుల కోసం ఆమరణ నిరాహార దీక్ష బీఎస్పీ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో, చేస్తున్న బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ప్రవీణ్ కుమార్ ను ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు ఎర్ర ప్రకాష్, అంబాల చందు, పున్నం, రాజేందర్, మనీ చందు, అంబాల అనిల్, రజనీకాంత్ పాల్గొన్నారు.