Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖానాపురం
పాకాల ఆయకట్టు రైతులు అధైర్య పడవద్దని చివరి ఆయక ట్టు వరకు నీరందిస్తామని స్థానిక ఎంపీపీ వేములపల్లి ప్రకాశరావు అన్నారు. ఈ సందర్భంగా వారు తుంగబంధం చివరి ఆయకట్టైన దుంపిల్లపాయ, వీరయ్య పాయ, గంగాదేవి పాయ చివరికి ఆయకట్టు నీటిపారకంను శుక్రవారం ఉదయం పరిశీ లించి మాట్లాడారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పాకాల ఆయకట్టు క్రింద రై తులు సుమారు 25వేల ఎకరాల వరి సాగు చేస్తున్నారని, పంట చివరి దశ వరకు పూర్తిస్థాయిలో నీరు అందిస్తామన్నారు. రైతుల కష్టాలను చూసి స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి గోదావరి జలాలను పాకాలకు తీసుకువచ్చామని, రెండు పం టలకు సరిపోను నీరుపూర్తిస్థాయిలో ఉందని తెలిపారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు రైతుల పంట పొలాలకు నిరంధించే భాగంగా అధికారులు, ప్రజాప్రతిని ధులు అహర్నిశలు శ్రమించి నీటిపారుదలను పరిశీలిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్ర మంలో కొత్తూరు సర్పంచ్ భూసరమా అశోక్ యాదవ్, ఉప సర్పంచ్ సామెల్, రంగాపురం గ్రామ పార్టీ అధ్యక్షులు బందారపు శ్రీనివాస్ గౌడ్, వార్డు మెంబర్లు కోరే రాము, పోతరాజు కుమార్, లస్కర్ మధుకర్ తదితరులు పాల్గొన్నారు.