Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాజీపేట
రైల్వే మంత్రిత్వ శాఖ ప్రతి ష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భారత్ గౌరవ్ పుణ్య క్షేత్ర యాత్ర రైలును యాత్రీకులు భక్తులకు సద్వినియో గం చేసుకోవడం అభినందనీయమ ని పుణ్య క్షేత్ర రైలు కాజీపేట నోడల్ అధికారి, సీనియర్ డీఎంఈ సందీ పకుమార్ అన్నారు. రైల్వేశాఖ 75వ అజాది కా అమృ త్ మహోత్సవ్‌లో భాగంగా ఐఆర్సిటీసీ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్ ఆధ్వర్యంలో రైల్వే మంత్రిత్వశాఖ ఆదేశాలతో దక్షిణ మధ్య రైల్వే ఏ ర్పాటు చేసిన భారత్ గౌవర్ పుణ్యక్షేత్ర యాత్ర రైలు కు కాజీపేట రైల్వే జంక్షన్ రైల్వే అధికారులు భాజా భజయంత్రిలతో శనివారంమద్యాహ్నం ఘనంగా స్వా గతం పలికారు. ఈ రైలులో పూరీ-కోణార్క్, గయా, కాశీ, అయోధ్య, ప్రయాగ తదితర పుణ్య క్షేత్ర దర్శ నాల దర్శనంకు బయలు దేరేందుకు కాజీపేట రైల్వే జంక్షన్ కు వచ్చిన యాత్రీకులకు రైల్వే అధికారులు భారత స్కాట్ అండ్ గైడ్స్ తో మర్యాద పూర్వకంగా పుష్పగుచ్చం అందచేశారు.
రైలు సికింద్రాబాద్ నుంచి కాజీపేట రైల్వే జంక్షన్‌కు చేరుకోగానే యాత్రీకులను తీసుకెళ్ళి రైలులో ఎక్కించి, కేటాయించిన భర్తులలో కూర్చోబె ట్టి, వీడ్కోలు పలికారు. రైల్వే జంకల్లో బయలు దేరిన యాత రైలుకు సీనియర్ డీఎంఈ సందీపకుమార్ జెండా ఊపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ రైల్వేశాఖ అన్ని వర్గాల ప్రజలు తక్కువ ఖర్చు (ప్యాకేజీ) తో దేశంలోని ముఖ్య పుణ్య క్షేత్రాలు, చారి త్రిక ప్రదేశాలను దర్శించుకునేందుకు ప్రత్యేక రైలును ఏర్పాటు చేసిందన్నారు. ఈ రైలులో యాత్రీకులకు అన్ని వసతులతో పాటు పుణ్య క్షేత్రాల దర్శనం కల్పించడం జరిగిందన్నారు. ఈ రైలు ఎని మిది రాత్రులు ఈ రైలులో యాత్రీకులకు అన్ని వసతుల తో పాటు పుణ్య క్షేత్రాల దర్శ నం కల్పించడం జరిగిందన్నారు. రైలు ఎనిమిది రాత్రులు, తొమ్మిది పగలులతో అన్ని పుణ్య క్షేత్రాలు, చారిత్రాక ప్రదేశాలను దర్శింపచేసి తిరిగి భక్తులను గమ్యస్థానాలకు చేర్చిస్తుందని తెలిపారు.
రైల్వేశాఖ అన్ని వర్గాల ప్రజలను దష్టిలో పెట్టుకు ని ఏర్పాటు చేస్తున్న ఈలాంటి పుణ్య క్షేత్ర యాత్రల ను ఉపయోగించుకో వాలని కోరారు. ఈ కార్యక్ర మంలో రైల్వే డివింతో హనుమా నాయక్, రైల్వే సీసీఐ రాజ్ గోపాల్, స్టేషన్ మాష్టర్ బాలరాజు తదిత రులతో పాటుగా స్థానిక రైల్వే అధికారులు, తదితరులు పాల్గొన్నారు.