Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హనుమకొండ
వరంగల్ పశ్చిమ నియోజకవర్గ సమగ్రాభివద్ధికై వీలైనంత త్వరగా నిధుల మంజూరు మరియు అపార్ట్మెంట్ వాసుల సమస్యలపై ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. ఆదివారం హైదరాబాద్ లోని బిఆర్కే భవన్ లో ప్రిన్సిపల్ సెక్రెటరీ అరవింద్ కుమార్‌ని కలిసి వరంగల్ పశ్చిమ నియోజకవర్గ సమస్యల పై వినతిపత్రం సమర్పించిన అనంతరం చీఫ్ విప్ మాట్లాడుతూ గౌరవ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ఈనెల 23న వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో పర్యటించ నున్న సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్స వం చేయనున్న నేపథ్యంలో వీలైనంత త్వరగా నిధులు మంజూరు చేయాలన్నారు.
అలాగే అపార్ట్మెంట్ వాసుల సమస్యల పరిష్కారం కొరకు కృషి చేయా లని ప్రిన్సిపాల్ సెక్రటరీ అరవింద్ కుమార్‌ని కోరడంతో వారు సానుకూలంగా స్పందించారని ప్రభుత్వ చీఫ్‌విప్ తెలిపారు.