Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పూలే సామాజిక న్యాయవేదిక అధ్యక్షుడు ప్రసాద్
నవతెలంగాణ-కాశిబుగ్గ
పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు సరిగా నిర్వహించలేని అసమర్ధ ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో గద్దె దించాలని అఖిల భారత మహాత్మ జ్యోతిరావు పూ లే సామా జిక న్యాయవేదిక రాష్ట్ర అధ్యక్షుడు కేడల ప్రసాద్ అన్నారు. టీఎస్ పి ఎస్ సిపరీక్షా పత్రం లీకేజీని నిరసిస్తూ శనివారం కాశిబుగ్గ అంబేద్కర్ జంక్షన్ వద్ద ప్ర జాసం ఘాల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేడల ప్రసాద్ మాట్లా డుతూ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి కెసిఆర్, టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డితమ పదవులకు రాజీనామా చేసి నిరుద్యోగులకు క్షమా పణ చెప్పాలన్నారు.కార్యక్రమంలో సా మాజి కవేత్త పెరుమాల్ల లక్ష్మణ్, రాష్ట్ర నాయకుడు కొమురయ్య, రౌతు శ్రీను, మేడిగ సతీష్, బీసీ సంఘం నాయకు లు పోతన వెంకటేశ్వర్లు, కళా వెంకట్, రామస్వామిపాల్గొన్నారు.