Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి
నవతెలంగాణ-కాశిబుగ్గ
వరంగల్ లో ప్రైసెస్ బోర్డు ల్యాబ్ లేకపోవడం వల్ల వ్యాపారులు, రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండిస్టీ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్ రెడ్డి అన్నారు. శనివారం నగరంలోని చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండిస్టీ కార్యాలయంలో స్పైసెస్ బోర్డు ఏర్పాటుచేసిన సుగంధ ద్రవ్యాల నాణ్యత పెరుగుదలపై రైతులకు శిక్షణ మరియు పసుపు, మిర్చి వ్యాపారస్తులకు సుగంధ ద్రవ్యాల పై ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ కోసం తీసుకోవలసిన జాగ్రత్తలు, స్పైసెస్ బోర్డు అమలు చేయబోతున్న వివిధ స్కీములపై ఏర్పాటుచేసిన సమావేశంలో రవీందర్ రెడ్డి మాట్లాడుతూ పసుపు ఉత్పత్తిలో వాడకంలో ఎగుమతిలో భారతదేశం ప్రధానమైనదని అన్నారు. భారతదేశ మిరప పంట ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉందన్నారు. వరంగల్ ఖమ్మం కరీంనగర్ జిల్లాలలో మిరప పంట అధిక విస్తరణలో సాగు చేస్తున్నట్లు తెలిపారు. స్పైసెస్ బోర్డు అసిస్టెంట్ డైరెక్టర్ విజిష్ట మాట్లాడుతూ పసుపులో సమగ్ర సస్యరక్షణ మరియు మిరప, పసుపు నిర్వహణ నిల్వ సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, పురుగుమందుల వాడకంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ప్రొజెక్టర్ స్లైడ్స్ ద్వారా వివరించారు.కార్యక్రమంలో వికాస్ అగ్రి ఫౌండేషన్ అధ్యక్షుడు సాంబశివరెడ్డి, బాలాజీ స్పైసెస్ గ్రోవెర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అంజిరెడ్డి, చాంబర్ ఆఫ్ కామర్స్ కోశాధికారి అల్లే సంపత్, ప్రతినిధులు కైలాస హరినాథ్, గౌరీశెట్టి శ్రీనివాస్, రాజేష్, వంశీ, మిలాన్, సదానందం, హరిబాబు, రామ్ గోపాల్ రావు, తదితరులు పాల్గొన్నారు.