Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
నవతెలంగాణ-పర్వతగిరి
పాలకుర్తి నియోజకవర్గం అభివద్ధిపై నాయకులు, కార్యకర్తలు విస్తత ప్రచా రం నిర్వహించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వరంగల్ జిల్లా పర్వత గిరిలో పాలకుర్తి నియోజకవర్గ ముఖ్య నాయకులు, పార్టీ ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ నియోజకవర్గంలో జరిగిన అభివద్ధిపై విస్తత ప్రచారం నిర్వహించాలని, జరు గుతున్న అభివృద్ధిని వేగవంతం చేయాలని కోరారు. ఇంకా జరగాల్సిన అభివద్ధిపై ఆలోచన చేయాలని చెప్పారు. వివిధ పథకాల వారిగా ఆయా పనుల పురోగతిని మంత్రి సమీక్షించారు. పనులు నిర్ణీత కాలంలో వేగంగా పూర్తి చేయాలని అందు కు అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని మంత్రి నియోజ కవర్గం నాయకులను ఆదేశించారు.ఈ ఏడాది పూర్తి చేయాల్సిన పనులపై మంత్రి దిశా నిర్దేశం చేశారు. ప్రజా ఉపయోగ పనులపై శ్రద్ధ వహించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో నియో జకవర్గ పార్టీ ప్రజాప్రతినిధులు పార్టీ బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.