Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మార్పీఎస్ వరంగల్ జిల్లా కన్వీనర్ కట్ల రాజశేఖర్
నవతెలంగాణ-పర్వతగిరి
ఎస్సీ వర్గీకరణ పై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా బిజెపి మొండి వైఖరిని మాదిగ ప్రజలకు తెలి యజేసి చైతన్యవంతం చేయ డం కొరకై పాదయాత్రలు చేపట్టడం జరిగిందని ఈ పాదయాత్ర శనివారం నాటికి 8 వరోజు పర్వతగిరి మండల కేంద్రానికి చేరుకుందని ఎం ఎస్ పి మండల ఇం చార్జి జిల్లా ధర్మయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఘన స్వాగతం పలికా రు. అనంతరం ఎమ్మార్పీఎస్ వరంగల్ జిల్లా కన్వీనర్ కట్ల రాజశేఖర్, గీసుగొండ మండల కన్వీనర్ పూర్ణరు,స్థానిక ఎంపిటిసి బొట్ల మహేంద్ర లు మాట్లాడారు. గత 9ఏళ్లుగా బీజేపీ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేయకుండా మాదిగ, ఉప కులా లను మోసం చేస్తున్నదని, బిజెపి ప్రభుత్వం మీద తిరగబడాల్సిన బాధ్యత మాదిగ బిడ్డలమైన మనకు ఎంతోబాధ్యత ఉందని స్పష్టం చేశారు.అనంతరం గ్రామ కమి టీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కమిటీకి అధ్యక్షులు గా చిన్నపెళ్లి రాజశేఖర్, ప్రధాన కార్యదర్శిగా అబర్లవంశీ, కార్యదర్శిగా పసుల భరత్, ఉపాధ్యక్షుడుగా చిన్న పెళ్లిఅజరు, ప్రచార కార్యదర్శి చిన్నపెళ్లి హరీష్ లు ఎన్నికయ్యారు. ఈ కార్యక్ర మంలో బొట్ల కుమార్ లింగాల జాను, బొట్ల శ్రీకాంత్, హరీష్, గాడిపెళ్లి చేరాలు, పసుల ఎల్ల య్య, మునిగే ఎల్లమ్మ, మచ్చ లక్ష్మీ, పూలమ్మ, వీరమ్మలు పాల్గొన్నారు.