Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాజీపేట
బాలవికాస సంస్థపై జరిగిన ఇన్కం టాక్స్ దా డుల్లో సంస్థఎలాంటిమోసాలకు పాల్పడలేదని విచా రణలో తేలినట్లు బాల వికాస సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరె క్టర్ సింగారెడ్డి శౌరిరెడ్డి అన్నారు. బుధవారం నుండి మూడు రోజులపాటు బాలవికాస సంస్థపై ఐటి దా డులు జరిగాయి. ఈ సందర్భంగా ఫాతిమా నగర్ లోని గల బాలవికాస కార్యాలయం నందు శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో శౌరిరెడ్డి మాట్లాడుతూ రూ.400 కోట్ల నిధులు ఒకే సంవత్సరంలో వచ్చినవి కావని 45 ఏళ్లలో 8వేల గ్రామాలలో అనేక రకాల పథకాల విలువ అన్నారు. బాలవికాస సంస్థ ప్రజల సంక్షేమం కొరకే పథకాలు గ్రామాల్లో అమలు చేస్తుందన్నారు. ఎఫ్సిఆర్ఏ నిబంధనలను ఉల్లంఘిం చడం, పన్ను ఎగవేత వాస్తవం కాదని బాల వికాసకు పన్నుమినహాయింపు వర్తిస్తుందన్నారు.
భారత దేశవ్యాప్తంగా తొమ్మిది రాష్ట్రాలలో ప్రజ లందరికీ తెలిసినట్టుగా బాలవికాస కుల, మత ప్రాం తం, రాజకీయాలకు అతీతంగా ఎన్నో ప్రజా అభివద్ధి పథకాలను చేస్తూ సుమారు కోటి జీవితాలకు తోడ్పా టును అందిస్తు ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తుం దన్నారు. గత మూడురోజులుగా బాలవికాస సంస్థ లో జరిగిన ఐటి సోదాలు దురదష్టకరం బాధాకరం. గత ఐదు సంవత్సరాలుగా బాలవికాస పెద్ద ఎత్తులో నిధులను సమీకరిస్తూ 9 రాష్ట్రాలలో అభివద్ధి కార్య క్రమాలను విస్తరించింది. సమస్యలు లోపాలు జరు గుతున్నాయోమొననే కోణంలో సోదాలు జరిగాయ ని భావిస్తుమన్నారు. బాలవికాసలో అవినీతి అక్ర మాలకు తావు లేకుండా నడుస్తుంది కాబట్టి ఇబ్బంది లేకుండా ఐటి సోదాలు ముగిసాయి. బోర్డ్ మెంబర్స్, సిబ్బంది ఐటీ అధికారులకు సంపూర్ణ సహకారం అం దించి వారికి ఉన్న సందేహాలను నివతి చేయడం జరిగింది.
బాల వికాస కార్యకలాపాలు యధావిధిగా కొన సాగుతాయని తెలియచేస్తున్నాము.బాలవికాస కి సం బంధించి 40 చోట్ల దాడులు అన్నారు. కానీ 11 చో ట్లు మాత్రమే సోదాలు జరిగాయన్నారు. బాలవీర సంస్థ భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు ప్రజల కొర కు చేపడుతాయని తెలిపారు.