Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి దయాకర్రావు
నవతెలంగాణ-వరంగల్
గుండెపోటుతో ఇటీవల చాలామంది క్షణాల్లో ప్రాణాలు కోల్పోతున్నారని ప్రాణ నష్టం జరగకుండా సీపీఆర్తోనే సాధ్యమవుతుందని పంచాయతీరాజ్ శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. వరం గల్ జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో శనివారం వ రంగల్ జిల్లా వైద్యశాఖ ఆ ధ్వర్యంలో ఏర్పాటుచేసిన సీపీఆర్ శిక్షణ కార్యక్రమ ప్రారంభానికి ముఖ్య అతి థులుగా పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి ద యాకర్రావు,వరంగల్ సీ పీ ఏవి.రంగనాథ్, మేయర్ గుండు సుధారాణి, జెడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, జిల్లా కలెక్టర్ పీ ప్రావీ ణ్య, వర్ధన్నపేట శాసన సభ్యులు ఆరూరిరమేష్, ఎంఎల్ సీ బస్వరాజు సారయ్య, కుడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్ హాజరైనారు. అనంతరం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ ఆడుతూ పాడు తూ కళ్లముందే తిరిగేవారు చూస్తుండగానే కార్డియాక్ అ రెస్ట్ ద్వారా వ్యక్తులు క్షణాల్లోనే ప్రాణాలు కోల్పోతున్నా రని విచారం వ్యక్తం చేశారు. గుండెపోటు వచ్చిందం టే ఆస్పత్రికిచేర్చి వైద్య చికిత్స అందించేలోపు ఏమైనా జరిగే ప్రమాదం ఉంది.అందుకే గుండె పోటుకు గురైనవారికి సత్వరంగా ప్రాథమిక చికిత్స అందించా లని రాష్ట్ర ప్రభుత్వం సీపీఅర్ పైన శిక్షణ కార్యక్ర మాన్ని ప్రారంభించిందని అన్నారు. అత్యంత కీలకమైన కార్డియో పల్మనరీ రీససి టేషన్(సిపిఆర్)పైన ప్రతీ ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు అశ్వినీతానాజీవాకడే, శ్రీవాత్సవ తది తరులు పాల్గొన్నారు.