Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -తాడ్వాయి
మండల కేంద్రంలో ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన ఆర్యవైశ్య హౌటల్ ప్రొప్రైటర్ భూపతి సాంబమూర్తి కుటుంబాన్ని శనివారం ములుగు జిల్లా, మండల ఆర్యవైశ్య సంఘం నాయకులు దినకర్మకు హాజరై బాధిత కుటుం బాన్ని పరామర్శించి ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షుడు పాలడుగు చంద్రశేఖర్ అధ్యక్షతన 42 వేల నగదు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా మండల ఆర్యవైశ్య సంఘం మహాసభ అధ్యక్షులు పాలడుగు చంద్రశేఖర్, జనరల్ సెక్రెటరీ అనుగం రవి, కార్యదర్శి ఎల్లంకి రమేష్ లు మాట్లాడుతూ ఆర్య వైశ్యులు ఎలాంటి బాధలు, ఇబ్బందులు పడ్డ వారికి తమకు సాధ్యమైనంత సహాయం అందిస్తున్నట్లు చెప్పారు. ఆర్య వైశ్యులు అన్ని రంగాల్లో ఎదగాలని ఆకాంక్షించారు. విద్య, ఉపాధి, ఆర్థిక, వైజ్ఞానిక రంగాల్లో ఎదగాలని కోరారు. ఆర్యవైశ్య సంఘం నాయకులు సిద్ధంశెట్టి శ్రీనివాసరావు, లక్ష్మణరావు, వైకుంఠం, బచ్చు సుబ్బారావు అనుగం రవి, విశ్వనాథం(హౌటల్), ఎల్లంకి రమేష్ సురేష్ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.