Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహబూబాబాద్
కేంద్రంలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కా ర్మిక వ్యతిరేక విధానాలను ఎండగట్టడం కోసం సం ఘటిత, అసంఘటిత రంగ కార్మిక వర్గాన్ని సంఘ టిత పరుస్తూ అఖిల భారత స్థాయిలో పోరాడాలని ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.జనార్ధన్ అన్నారు. ఆదివారం మహబూబాబాద్ జిల్లా కేంద్రం లోని బట్టు అంజయ్య స్మారకభవన్లో ఐఎఫ్టీయూ జిల్లా ప్రథమ మహాసభ జిల్లా అధ్యక్షులు పర్వత కో టేష్ అధ్యక్షతన జరిగింది. సభకు ముందు మహబూ బాబాద్ పట్టణంలో కార్మికులు, అరుణోదయ డప్పు చప్పుళ్ళు, మహిళల కోలాటం, ఆటపాటలతో పెద్ద ఎ త్తున ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా జనా ర్ధన్ మాట్లాడుతూ దేశంలో ప్రజల జీవనం అస్తవ్య స్తం కావడానికి, కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయడానికి మోడీ పూనుకుంటున్నాడని ఆరోపించారు. ప్రజా సమస్యలను పరిష్కరించలేని మోడీ,ప్రజా సంపదను దోచుకుంటూ, బడా కార్పోరేట్ సంస్థలకు, దోపిడీ వర్గాలకు దోచిపెడుతున్నదని,ప్రభుత్వ రంగ సంస్థల ను ప్రైవేటు పరం చేస్తూ,లాభాల్లో ఉన్న వాటన్నిం టిని అమ్మి వేస్తున్న పరిస్థితిని తీవ్రతరం చేస్తున్నాడని అన్నారు.కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపు నిచ్చారు.సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి బండారి ఐలయ్య మాట్లాడుతూ కేంద్రంలో, రాష్ట్రంలో అధికా రంలో ఉన్న మోడీ,కేసిఆర్ ప్రభుత్వాలు ప్రజా వ్యతి రేక విధానాలను అనుసరించడం జరుగుతుందన్నా రు. కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టా లను రద్దు చేసి,కార్మికులకు ఎలాంటి చట్టబద్ధ హ క్కులు లేకుండా చేసి వారి స్వేచ్ఛను హరించివేయడ మే మోడీ ప్రభుత్వ విధానం అని అన్నారు. ఈ కార్య క్రమంలో ఐఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి హల వత్ లింగ్యా, ఎం.డీ.జబ్బార్,మాచర్ల వెంకన్న, ఎన్. మురళి, పి.చంద్రమౌళి,ఎస్.డీ. నిజామొద్దిన్, పీవై ఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి సామ పాపయ్య, గండెల పూనేష్, పీడీఎస్యు బానోత్ దేవేందర్,చిట్టిమల్ల అశోక్, నాయిని వీరన్న, సజ్జనపు సరస్వతి, కొలిపాక ఐలయ్య, ఎం.డీ.కవిత, ఎస్కె.మైరూనిస, ఎండీ.యా కుబి, బుక్యా కల్పన,గంజి మునితారెడ్డి, మాలోత్ ప్రి యాంక, కుక్కముడి అనిత, బానోత్ సునీత, తదితరులు పాల్గొన్నారు.