Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్మెట్ట
శ్రీ సత్య సాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉచిత వైద్య ఆరోగ్య శిబిరాన్ని ఆది వారం నర్మెట్ట మండలంలోని మచ్చు పహాడ్ గ్రామంలో ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో స్త్రీ, శిశువు విభాగం మధుమేహం, చర్మసంభందిత, దంత, చెవి, ము క్కు, గొంతు, కంటి పరీక్ష,హౌమియో వైద్యము,చాతీ వైద్యము,క్యాన్సర్ ఎముకల, కీళ వైద్యము, మూత్ర సంబంధ వ్యాధులు రోగ నిర్ధారణ, పరిశోధన, పరీక్షలు,నాడీ వైద్యము, గోధే ఆయుర్వేదము, గుండె వైద్యము ప్రత్యేక వైద్యులతో 1500 పైగా ప్రజలకు వైద్యం అందిచారు. కంటి ఆరేషన్లు హైదరాబాదులోని అసుపత్రిలో చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ ముఖ్యలు పట్టాభి, దీపక్ రామ్ గ్రా మ సర్పంచ్ శివరజు, యువజన సంఘాలు పాల్గ్గొన్నారు.