Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జనగామ కలెక్టరేట్
నిరుద్యోగ యువతీ యువకులను రాష్ట్ర ప్రభుత్వం మో సం చేస్తుందని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆది వారం స్థానిక రైల్వే స్టేషన్ చౌరస్తాలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కాంగ్రెస్ పార్టీ పట్టణ శాఖ అధ్యక్షులు ధర్మ పురి శ్రీనివాస్, మండల శాఖ అధ్యక్షులు కొన్నె మహేందర్ రెడ్డిల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ జిల్లా వర్కిం గ్ ప్రెసిడెంట్ మన్సన్పల్లి లింగజీ, నియోజకవర్గ ఇన్చార్జి చెంచారపు శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా నాయకులు ఉడుత రవి యాదవ్, అల్లం ప్రదీప్‌రెడ్డిలు మాట్లాడుతూ ప్రభుత్వ విధా నాలను ఎండగట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో న్యాయం జరగడం లేదని నిరుద్యోగులు, యువతీ యువకులు దశాబ్దాల పాటు ఉద్యమించారని, స్వరాష్ట్రంలో కూడా నిరుద్యోగులకు న్యా యం జరుగడం లేదన్నారు. తెలంగాణరాష్ట్రం ఏర్పడిన తరు వాత నిర్వహించిన పరీక్షలన్నింటిని రద్దు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని, ఇందుకు కేసిఆర్, కేటిఆర్లే బాధ్యత వహించా లని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకు లు రంగు రవి, తోట సత్యం, బొంతపల్లి నాగరాజు, పట్టణ యూత్ అధ్యక్షులు మాజిద్, మీడియా కన్వీనర్ పిట్టల సతీష్, సలేంద్రి శ్రీనివాస్, బండారు శ్రీనివాస్, వేముల మల్లేశం, బిక్షపతి, కిరన్, రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.
దేవరుప్పుల : గ్రూప్ వన్ పేపర్ లీకేజీ నిరసనగా టీప ీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మను జనగామ సూర్యాపేట ప్రధాన రహదారిపై ఆదివారం దగ్ధం చేశారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పెద్ది కృష్ణమూర్తి, నాయకులు మేడ ఎల్లయ్య,బుక్య సజ్జన్,రుద్రోజు పురుషోత్తం,బుక్యయాదన్న,ఉప్పుల ప్రకాష్, అనిల్, శ్రీకాంత్,ఉప్పుల ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.
లింగాలఘనపురం : పేపర్ లీకేజీ పై టీపీసీసీ ఆదేశా నుసారం మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్య క్షులు కొల్లూరు నర్సింహులు (శివకుమార్) ఆధ్వర్యంలో ఆది వారం మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన కాంగ్రెస్ కార్యదర్శి కీస ర దిలీప్ రెడ్డి,లింగాలగణపురం సర్పంచ్ సాదం విజయమ నోహర్, ఎంపీటీసీ గుగ్గిల నరసయ్య, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బసవగాని అనిల్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు నర్సింగ రమేష్, యూత్ కాంగ్రెస్ మం డల అధ్యక్షుడు చిటకోరు సంపత్, లింగాలగణపురం గ్రామ శాఖ అధ్యక్షుడు బుట్రెడ్డి రాజ రవీందర్ రెడ్డి, సీనియర్ నా యకులు వంగ ఉప్పలయ్య, బిట్ల నాగభూషణం, కౌడ ఆంజ నేయులు, నీలం మోహన్, కొండబోయిన రాజు , ఐలేని అ శోక్ రెడ్డి, బెజ్జం ఆంజనేయులు, బిట్ల ఉప్పలయ్య, భగు మ హర్షి, పడిదే రాజశేఖర్, దామెర నాగరాజ్, తూటి యాదగిరి, గ్రామ శాఖ అధ్యక్షులు కొండబోయిన మహేష్, బత్తిని అశో క్, కత్తుల శ్రీనివాస్ రెడ్డి, జనగాం ఉపేందర్, వేముల వెంక ట్ రెడ్డి, కన్నబోయిన శ్రీనివాస్, పసునూరి ఉపేందర్, రా గం నారాయణ, బండ రమేష్,బొజ్జం లక్ష్మణ్ గునిగంటి శేఖ ర్, ఎర్ర రాజు, పిట్టల రాజు, బింగి కార్తీక్, ముఖ్య నాయకు లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
పాలకుర్తి : టీఎస్సీఎస్సీ పేపర్ లీకేజీకి కారకులైన నిం దితులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం రాజీవ్ చౌరస్తాలో నిరసన తెలి పారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గిరగాని కుమారస్వామి గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ, జిల్లా కార్యదర్శి చిలువేరి పెం టయ్యలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల వల్లనే పేపర్ లీకేజీ అయిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వ ర్యంలో చేపట్టిన నిరసనలో సీఎం కేసీఆర్, పురపాలక ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. ఈ కార్య క్రమంలో బీసీ సెల్ అధ్యక్షులు బైకాని ఐలేష్ యాదవ్, ఎస్సీ సెల్ అధ్యక్షులు గాదెపాక భాస్కర్,జిల్లా యూత్ ఉపాధ్యక్షు లు కూటికంటి నరేష్,నియోజకవర్గ యూత్ ఉపాధ్యక్షులు గోనె మహేందర్ రెడ్డి,నియోజకవర్గ యూత్ కార్యదర్శి కమ్మ గాని మహేష్ గౌడ్,బమ్మెర సర్పంచ్ జలగం నాగభూషణం, ఉపసర్పంచ్లు బోడ మహేందర్, నూనవత్ హరిలాల్, పాలకుర్తి సొసైటీ డైరెక్టర్ సుగురు శేఖర్,మండల నాయ కులు భైరు భార్గవ్, సింగిరెడ్డి సత్తిరెడ్డి, నీరటి చంద్రయ్య, నలమాస రమేష్, చిలువేరు సంపత్, పెండ్లి సంపత్, పెరపు యాదగిరి, సుడిగాల సోమయ్య, జోగు పర్శరాములు, బిక్కో జీ, మాడరాజు యాకయ్య, చెన్నూరి సోమయ్యలతోపాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
బయ్యారం : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ దోషులను కఠి నంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం మండల కాం గ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని బస్టాండ్ సెం టర్ నందు అంబేద్కర్ విగ్రహం వద్ద కేటీఆర్ దిష్టి బొమ్మ దగ్ధం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్బంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కంబాల ముసలయ్య, టౌన్ కాంగ్రె స్ పార్టీ అధ్యక్షులు నాయిని శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో టిఎస్పిఎస్సి నిర్వహిస్తున్న వివిధ పోటీ పరీక్షల ప్రశ్నా పత్రాల లీకేజీ ఘటనల పై హైకోర్టు సిట్టింగ్ జడ్జిచే సమగ్ర విచారణ జరిపి కారకులను కఠినంగా శిక్షించా లని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి గట్ల గణేష్, ఎంపీటీసీ భూక్యా లక్ష్మి, జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు కొండపల్లి లక్ష్మి, మండల మహిళా ప్రధాన కార్యదర్శి మండ రేణుక, సర్పంచ్ కారం బాస్కర్, కొవ్వూరి దామోదర్ రెడ్డి, సొసైటి డైరెక్టర్ కేతమల్లు, కిసాన్ మండల అధ్యక్షులు లింగయ్య, నాయకులు రామూర్తి, కోడి శ్రీనివాస్, యాదగిరి, కిషన్, రమేష్, వెంకన్న, రామకోటి, వెంకటేశ్వర్లు, సామ్య నాయక్, బి. శ్రీనివాస్, బి. వీరన్న, లూనావత్ బాలా జీ, విగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
బచ్చన్నపేట : మాజీ టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఆదేశాల మేరకు మండల పార్టీ అధ్యక్షుడు వంచ వెంకట్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి అల్వల ఎల్లయ్య, టౌన్ ప్రేసిడెంట్ కోడూరి మహాత్మా చారి ఆధ్వర్యంలో, బచ్చ న్నపేట మండల కేంద్రంలో లీకేజీల వల్ల నష్టపోయిన నిరు ద్యోగుల భవిత గురించి ధర్నా, రాస్తారోకో నిర్వహిస్తూ ఉం డగా అక్రమంగా పోలీస్ స్టేషన్‌కి తరలించారు. ఈ సంద ర్భంగా జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు, పిన్నింటి నారాయణ రెడ్డి, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నిమ్మ కరుణాకర్ రెడ్డి,జిల్లా ఓబీసీ సెల్ వైస్ ఛైర్మన్ చేరుకురి శ్రీనివాస్, మం డల ప్రచార కార్యదర్శి జంగిలి స్వామిలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో,మండల బీసీ సెల్ అధ్యక్షుడు దాచేపల్లి నర్సిం గరావు, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు నల్లా మహేందర్, మండల కార్యదర్శులు అరుకల శ్రీనివాస్,అవధూత శ్రీని వాస్, కొయ్యడ శ్రీనివాస్ గౌడ్,పందిపెళ్లి నర్షి రెడ్డి, మండల కాంగ్రెస్ సోషల్ మీడియా కన్వీనర్ కవ్వం రాజు రెడ్డి, మాజీ ఎంపీటీసీ బుర్ర బలమని, రాజేష్ కన్నా, నక్కొని గూడెం గ్రా మ శాఖ అధ్యక్షుడు బోడ బట్ల ఐలయ్య చిలుక ప్రవీణ్, వల బోజు భాస్కరా చారి, పందిపెళ్లి ఏళ్ల రెడ్డి, నర్మెట్ట అంజి గౌడ్, ఉదరు గౌడ్, సహాయ కార్యదర్శి నీల మల్లేష్, గొర్ల అబ్బు లు, అశం, లింగంపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు అన్నబోయిన సత్తయ్య, తదితరులు పాల్గొన్నారు.
స్టేషన్‌ఘన్‌పూర్ : నిరుద్యోగుల జీవితాలతో సర్కారు చెలగాటం ఆడుతోందని మాజీ పీసీసీ సభ్యులు గంగారపు అమత రావు ధ్వజమెత్తారు. టీఎస్పీఎస్ పేపర్ లీకు విష యమై, టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు డివిజన్ కేంద్రంలో అంబేడ్కర్ విగ్రహం ఎదుట మండల అధ్యక్షుడు జూలుకుంట్ల శిరీష్ రెడ్డి ఆధ్వర్యంలో కెసిఆర్, కేటీ ఆర్ దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ పీసీసీ కార్యదర్శి చేపూరి వినోద్, జిల్లా కార్యదర్శి చింత ఎల్ల య్య, కిసాన్ సెల్ మండల అధ్యక్షులు సింగాపురం వెంకట య్య ఎస్సి సెల్ మండల అధ్యక్షులు నలిమేలా ఏలీయా, జీడీ రాంచందర్, మేకల మల్లేశం, నియోజకవర్గం యూత్ కాంగ్రే స్ అధ్యక్షులు శ్రీనివాస్, ఉపాధ్యక్షులు వసంత్, మండల ప్ర ధాన కార్యదర్శి సింగాపురం నాగయ్య, కోరుకుప్పుల మహేం దర్, గట్టు కోఠి, నక్క పాపయ్య, షేక్ జానీ బాబా , రియాజ్ అలీ, వినరు తదితరులు పాల్గొన్నారు.
కొడకండ్ల : ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల గ్రూప్ వన్ కాని స్టేబుల్ ఇంటర్ విద్యార్థుల ప్రశ్నాపత్రాలు లీకేజీల నిరసిస్తూ ఈ ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనంగా ఆదివారం కాం గ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బస్టాండ్ చౌరస్తా వద్ద కేటీఆర్ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మండల పార్టీ అ ధ్యక్షుడు ధారావత్ సురేష్ నాయక మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు సోమ నరసయ్య పాలకుర్తి నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ధారావత్ రాజేష్ నాయక్ అధ్యక్షుడు రాహుల్ నాయక్ ఎస్సీసెల్ అధ్యక్షుడు బిక్షపతి పట్టణ అధ్యక్షుడు రవీందర్ యూత్ అధ్యక్షులు మనోహర్ కాంగ్రెస్ నాయకులు వంశీ రమేష్ శ్రీనివాస్ వెంకన్న బిక్షం ఉప్పలయ్య అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
గార్ల : పేపర్ లీకేజి కేసును సిబిఐకి అప్పగించి పూర్తి గా దర్యాప్తు చేపట్టాలని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ధని యాకుల రామారావు, ఇల్లందు నియోజకవర్గ మహిళ కాంగ్రె స్ నాయకురాలు గుండె బోయిన నాగమణిలు డిమాండ్ చేశారు. టిపిసిసి అధ్యక్షులు ఎ.రేవంత్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు జె.భారత్ చంద్రారెడ్డిల పిలుపు మేరకు గ్రూప్ -1, ఎఈ పరీక్షల పేపరు లీకేజీ వ్యవహారంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిర సిస్తూ ఆదివారం స్దానిక నెహ్రూ సెంటర్లో రాస్తారోకో నిర్వహించారు. ఈ రాస్తారోకోలో నాయకులు వశ్య, కోటేశ్వర రావు, నవీన్,శేఖర్, చిన్న నాగయ్య,బిచ్య ఉన్నారు.
నెల్లికుదురు : మండల కేంద్రంలోని కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి వెంకటే శ్వర్లు, నైనాల ఎంపిటిసి పెరుమండ్ల గుట్టయ్య, పిఎసిఎస్ డైరెక్టర్ నెల్లికుదురు, బాలాజీ నాయక్ కిసాన్ సేల్ మండల అధ్యక్షుడు పూర్ణచందర్, అధికార ప్రతినిధి మౌనేందర్, సట్ల యకయ్య, కిషన్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్త లు,యువజన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.