Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దేవరుప్పుల
మండల కేంద్రంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు నేతృత్వం లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి సెర్ప్ ఉద్యోగులు ఆదివారం పా లాభిషేకం నిర్వహించారు.సెర్ప్ ఉద్యోగులకు పే స్కేల్ ప్రకటించనున్నట్లు బడ్జెట్ ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తూ మంత్రిని దేవరుప్పుల మండల కేంద్రంలో సెర్ప్ ఉద్యోగుల జేసీ నేతలు మ ర్యాదపూర్వకంగా కలిశారు. సందర్భంగా మంత్రిని శాలువాతో సత్కరించి, కృతజ్ఞ తలు తెలిపారు. సెర్ప్ ఉద్యోగులకు పే స్కేల్ ఇస్తామని 2018లో టీఆర్ఎస్ మేని ఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు బడ్జెట్లో చేసిన ప్రకటన చేసినందుకు ఉద్యోగుల తరఫున సీఎం కేసీఆర్‌కు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రి హరీశ్‌రావు, కేటీఆర్ లకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘాల జేసీ నేతలు గంగాధర్‌రెడ్డి, నర్సయ్య, సుభాష్, జానయ్య, సురేఖ, వెంకట్, గిరి, మధు, దేవరుప్పుల ఏపిఎం వెంకట్ రెడ్డి, యాక న్న, శంకర్, రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రభు త్వ పథకాలను మరింత సమర్థవంతంగా అమలు చేసి సమూలంగా పేదరిక నిర్మూలన చేసేందుకు కృషి చేస్తామని ఉద్యోగులు పేర్కొన్నారు.