Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జనగామ
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో తుపాకీ ప ట్టిన తొలిమహిళ మల్లు స్వరాజ్యం అని సిపిఎం జిల్లా కార్య దర్శి మోకు కనకారెడ్డి అన్నారు. ఆదివారం పార్టీ జిల్లా కమి టీ ఆధ్వర్యంలో స్థానిక పార్టీ జిల్లా కార్యాలయంలో తెలంగాణ సాయుధ, స్వాతంత్య్ర సమరయోధురాలు మల్లు స్వరాజ్యం ప్రథమ వర్ధంతి సిపిఎం జనగాం పట్టణ కార్యదర్శి జోగు ప్రకాష్ అధ్యక్షత నిర్వహించారు. మోకు కనకారెడ్డి స్వరాజ్యం చిత్రపటానికి పూలమాల వేసి విప్లవ జోహార్లు అర్పించారు ఈ సందర్భంగా కనకా రెడ్డి మాట్లాడుతూకొద్ది మంది మహిళలు సమసమాజం కోసం అక్షరాన్ని, తుపాకీ తూటాను సమానంగా ఉపయోగించే దైర్యాన్ని ముందుతరా లకు అందించడానికి జీవిస్తూ ఆరని తేజోమూర్తిగా ప్రజల హృదయాల్లో నిలుస్తారని అన్నారు.మల్లు స్వరాజ్యం సూర్యా పేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం కరివిరాల కొత్తగూ డెం గ్రామంలో భూస్వామ్య కుటుంబంలో భీమిరెడ్డి రామి రెడ్డి, చొక్కమ్మ పుణ్యదంపతులకు 1931వ సంవత్సరంలో జన్మించారు అని తెలిపారు. వీరికి వందలాది ఎకరాల భూ వసతి ఉన్న భూస్వామ్య కుటుంబంలో పుట్టినప్పటికీ సామా న్యుల కష్టాలను సహించలేక 1945-46వ సంవత్సరంలో జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని నిజాం సర్కారును గడగడలాడించి నైజాం గుండాల దౌర్జన్యాలను తిప్పికొట్టిన సాహసి అని అన్నారు.మల్లు స్వరాజ్యం సాయుధ పోరాటంలో అదిలాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాలో పని చేశారని అన్నారు.నాడు ప్రజల్లో నిజాము మతోన్మాద, దొరల దురహంకారాన్ని పాటల ద్వారా చైతన్య పరిచి దైర్యం నిం పారు. ఈ పోరాటాల్లో మహిళ కమాండర్‌గా పని చేశారని తెలిపారు.75 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ, ప్రజాప్రస్థానంలో ఆమె రెండు సార్లు (1978, 1983లలో) తుంగతుర్తి శాసనసభ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్ర దేశ్ రాష్ట్రంలో జరిగిన మద్యపాన వ్యతిరేక పోరాటంలో మ ల్లు స్వరాజ్యం ప్రముఖ పాత్ర పోషించారన్నారు.ఈ తరం తల్లిదండ్రులకు ఆడబిడ్డలకు ఎలా పెంచాలి అన్న ప్రశ్నకు జ వాబు స్వరాజ్యం జీవిత అధ్యయనమే ఆదర్శం అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రాపర్తి రాజు, ఇర్రి అహల్య, జిల్లా కమిటీ సభ్యులు పోత్కనూరి ఉ పేందర్, సుంచు విజేందర్, భూక్యా చందు నాయక్, బిట్ల గణేష్, పట్టణ కమిటీ సభ్యులు కళ్యాణం లింగం, బోట్ల శ్రా వణ్, పల్లెర్ల లలిత, చిర్ర రజిత, బూడిది అంజమ్మ, చిదు రాల ఉపేందర్, పాము శ్రీకాంత్, గిరి పాల్గొన్నారు.
స్వరాజ్యానికి నివాళులర్పిస్తున్న సాదుల శ్రీనివాస్
మహబూబాబాద్ : తెలంగాణ సాయుధ పోరాటంలో భూమికోసం, భుక్తి కోసం ఉద్యమించిన మల్లు స్వరాజ్యం స్ఫూర్తితో కార్యకర్తలు పోరాటాలకు సిద్ధం కావాలని సిపిఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్ పిలుపు నిచ్చారు. ఆది వారం సిపిఎం పార్టీ కార్యాలయంలోమల్లు స్వరాజ్యం ప్రథ మ వర్ధంతి సభ భానోత్ సీతారాంనాయక్ అధ్యక్షతన నిర్వ హించడం జరిగినది. ఈ సభకు ముఖ్యఅతిథిగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్ హాజరై మాట్లాడారు. భూమికోసం భుక్తి కోసం ప్రజా విముక్తి కోసం తాడిత పీడిత ప్రజల కోసం వ్యక్తి చాకిరి విముక్తి కోసం పేదల పక్షాన పోరా డినటువంటి వీర వనిత మల్లు స్వరాజ్యం అన్నారు. భూ స్వామి కుటుంబంలో పుట్టి పేదల కోసం అనేక సంవత్సరా లుగా పోరాటాలు చేసి భూములు పంచడంలో ముందుండి పోరాడిన నాయకురాలు అనిఅన్నారు.అంతేకాకుండా జాగిం దారులకు జమీందారులకు భూస్వాములకు ఎదురు తిరిగి పోరాడి వారి దగ్గర ఉండబడే వేలాది ఎకరాల భూమిని పేద లకు పంచడం జరిగినది. ఎన్ని కష్టనష్టాలు వచ్చినా పట్టిన ఎర్ర జెండా కోసం తన తుది శ్వాస వరకు ఆ జెండాను వద లకుండా మరణించినటువంటి వీర వనిత అనే కొని ఆడా రు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సమ్మెట రాజమౌళి, టౌన్ కమిటీ సభ్యులు రావుల రాజు, కుమ్మరికుంట్ల నాగన్న, యమగాని వెంకన్న, సూర్య ప్రకాష్, మోతిలాల్, వెంకటేశ్వర్లు, రమ, నరేష్ పాల్గొన్నారు.
మల్లు స్వరాజ్యం జీవితం ఆదర్శం : రాపర్తి సోమయ్య
జఫర్గడ్ : మండల కేంద్రంలో సిపిఎం ఆధ్వర్యంలో ఆదివారం మల్లు స్వరాజ్యం ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పార్టీ మండల కమిటీ నాయకులు పూల మాలవేసి నివాళులర్పించడం జరిగింది.స్వరాజ్యం ఆశయా లు కొనసాగిస్తామంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ సిపిఎం మండల కార్యదర్శి రాపర్తి సోమయ్య మాట్లాడుతూ నాటి నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన గొప్ప యోధురాలు అని అన్నా రు. విస్నుర్ రాపాక రామచంద్రారెడ్డి గడీలను కూచ్చేందుకు కీలక పాత్ర పోషించింది మల్లు స్వరాజ్యం అన్నారు.
నాడు నిజాం తెలంగాణలో దుష్ట పాలన కొనసాగిస్తూ దానికి మద్దతుగా గ్రామాలలో జమీందారులు, జాగిర్దారులు, పటేల్ పట్వారిలు ప్రజలను పన్నుల కట్టాలని పీడించే వారని అన్నారు. దొరలు తమ వ్యవసాయ పొలాల లో ఇంటిదగ్గర ప్రజలచే వెట్టి చాకిరి చేయించుకునే వారని మహిళలపై అతి క్రూరంగా ప్రవర్తించే వారిని ఎదురు వచ్చిన వారిని అత్యాచా రాలు చేసేవారన్నారు. ఇంతటి భయానకర పరిస్థితులలో నాడు రాపాక రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా ఆంధ్ర మహా సభ పేరుతో కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో దొరకు ఎదు రు తిరిగి పోరాటం కొనసాగించిందని, ఎందరో మహిళలను కదిలించి పోరాటంలో నిలిపారని అన్నారు. నాటి తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను తెలుసుకొని ఆనాటి పోరాట స్ఫూర్తిని తీసుకొని నేటి పాలకులపై పోరాటం చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ స భ్యులు ఎండి షబానా, మండల కమిటీ సభ్యులు వడ్లకొండ సుధాకర్, గుండెబోయిన రాజు, కాట సుధాకర్, ఎండి ఎగ్బా ల్, శీను, కార్యకర్తలు పెద్ద రాములు, శాంసోద్దీన్, వడ్లకొండ రాజు తదితరులు పాల్గొన్నారు.
స్వరాజ్యం స్ఫూర్తితో భవిష్యత్తు ఉద్యమాలు : పాపారావు
కేసముద్రం రూరల్ : భూమి కోసం భుక్తి కోసం వేట్టి చాకిరి విముక్తి కోసం తెలంగాణ గడ్డపై జరిగిన విరోచిత సాయిధ రైతాంగ పోరాటంలో పసితనంలోనే పాల్గొని నైజా ము రాచరిక పాలన అంతం కోసం, భూస్వాముల, దేశ్ము ఖ్ల,రజాకార్ల అరాచకాలకు వ్యతిరేకంగా బంధూకు పట్టి దళ నాయకురాలై, అలుపెరుగని అవిశ్రాంత పోరాటంలో నిప్పుక నికై నింగికెగిసిన పోరు కెరటం మల్లు స్వరాజ్యం పోరాటా ల స్ఫూర్తితో భవిష్యత్తులో ఉద్యమాలు కొనసాగుతాయని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు మార్తినేని పాపారావు అన్నా రు. ఆదివారం కేసముద్రం మండల కేంద్రంలోని సీపీఎం కార్యాలయంలో అమరజీవి మల్లు స్వరాజ్యం ప్రథమ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మల్లు స్వరాజ్యం చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించ డం జరిగింది.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు చాగంటి కిషన్, జల్లే జయరాజ్, ఏనుగు సూరారెడ్డి, పి.పుల్లా రెడ్డి, మట్టి కృష్ణ, కొంగర అర్జున్, జల్లంపల్లి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.