Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పాలకుర్తి
ప్రేమ పేరుతో మోసం చేసిన యువ కుడిని పోలీసులు అరెస్టు చేసి కటకటాల కు పంపించిన సంఘటన ఆదివారం మండలంలో చోటు చేసుకుంది. పాలకుర్తి సీఐ దేవనపల్లి విశ్వేశ్వర్, ఎస్సై తాళ్ల శ్రీకాం త్లు తెలిపిన వివరాల ప్రకారం జనగామ జిల్లా లింగాలగణపురం మండలం చీటూరు గ్రామానికి చెందిన వాతల రీన పాలకుర్తి మండలం శాతాపురం ఎక్స్ రోడ్డు తండాకు చెందిన లాకవత్ మోహన్ ( వినోద్) లు జనగామలో డిగ్రీ చేస్తున్న సమయంలో ఇద్దరికీ పరిచయం ఏర్పడి ప్రేమగా మారిందని తెలిపారు.కొన్ని సంవత్సరాల పాటు ప్రేమించుకున్నాక పెళ్లి కూడా చేసుకుంటానని అమ్మాయికి హామీ ఇచ్చి శారీరకంగా లొంగదీసుకున్నాడని, గుట్టుచప్పుడుకాకుండా మరో యు వతిని గత రెండు రోజుల క్రితం వివాహం చేసుకున్నాడని తెలిపారు. హైదరా బాదులోని మియాపూర్‌లో పనిచేస్తున్న రీనా శాతాపురంలోని ఎక్స్‌రోడ్డు తండా లో యువకుని ఇంటికి వెళ్లగా అతని తల్లిదండ్రులు, అక్క, బావలు కలిసి ఫోన్ లా క్కొని తీవ్రంగా కొట్టారని వివరించారు. యువతి పాలకుర్తిలోని ప్రభుత్వ ఆసుపత్రి లో చికిత్స చేయించుకున్నదని, ప్రేమించి మోసం చేసి మరో యువతిని పెళ్లి చేసు కున్న యువకుడితో పాటు వారి బంధువులపై పోలీసులకు యువతి ఫిర్యాదు చేసిందని తెలిపారు. ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన యువకుడు తప్పిం చుకొని తిరుగుచుండగా పోలీసు గాలింపు చర్యలు చేపట్టగా నిందితుడు ఆలయ సమీపంలో గల ఆర్చి వద్ద ఉన్నాడని సమాచారంతో పోలీసులు యువకున్ని పట్టు కున్నారని తెలిపారు. రీనా ఫిర్యాదు మేరకు యువకుడ్ని అరెస్టు చేసి కటకటాలకు తరలించామని పోలీసులు తెలిపారు.