Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మొక్కజొన్న పంట నేలమట్టం
- తడిసి ముద్దయిన మిర్చి
- కూలిన ఇండ్లు, నేలకొరిగిన వృక్షాలు, విద్యుత్ స్తంభాలు
- పిడుగుపాటుతో పశువులు మృతి
- ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్
నవతెలంగాణ-కేసముద్రం రూరల్
అకాల వర్షంతో నష్ట పోయిన రైతాంగాన్ని తక్షణమే ప్రభు త్వం ఆదుకొని నష్టపరిహారం చెల్లించాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి పాపారావు, మహబూబాద్ జిల్లా కార్యదర్శి మారుతి నేని పాపారావు డిమాండ్ చేశారు. అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను ఆదివారం పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ మండల వ్యాప్తంగా దాదాపు వేల ఎకరాలలో అకాల వర్షానికి మొక్కజొన్న పంట దెబ్బతిని రైతాంగం దిక్కుతోచని స్థితిలో ఇబ్బందులకు గురవుతున్నారని, తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పం దించి పంట నష్టం అంచనా వేసి ప్రకృతి విపత్తు సాయం క్రింద నిధులు విడుదల చేసి రైతులను ఆదుకోవాలి, రైతన్నలు మనో ధైర్యం కోల్పోకుండా పోరాటాలకు సిద్ధమై ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి తమ హక్కులను రాబట్టుకోవాలని కోరారు. కేసముద్రం మండలంలో ధన్నసరి శివారు కోత్తురు రైతు సారంపల్లి సంజీవ, సోమిరెడ్డి, వెంకటగిరి రైతు కంచ గౌరయ్య,ఉప్పరపల్లి గ్రామ రైతు కోప్పరి రాజు,మంచాల రాంబాబు, మంచాల రవి, కేసము ద్రం విలేెజ్ లక్కాకుల సత్యనారాయణ,తోట నాగయ్య, తాళ్లపూ సలపెళ్లి గ్రామంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు గోడి శాల వెంకన్న, అమీనపురం గ్రామంలో రైతు సంఘం నాయ కులు నీరుటి జలంధర్ పంట నష్టపోయిన రైతులను ఆదుకో వాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ మండల నాయకు లు చాగంటి కిషన్, రైతు సంఘం మండల ఉపాధ్యక్షులు పిపు ల్లారెడ్డి, సీఐటీయూ మండల కార్యదర్శి జల్లే జయరాజు, ఏనుగు సూరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రైతులకు కడగండ్లు మిగిల్చిన వడగండ్ల వాన
శనివారం రాత్రి కురిసిన ఆకాల వర్షం కేసముద్రం మం డలం కల్వల గ్రామంలో నష్టపోయిన మొక్కజొన్న పంటలను కాంగ్రెస్ కల్వల గ్రామ పార్టీ అధ్వర్యంలో సందర్శించి, రైతులకు పంట నష్టం క్రింద ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం చెల్లిం చాలని డిమాండ్ చేశారు. గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గండి శ్రీను ఆధ్వర్యంలో మహిళా కాంగ్రెస్ మండల అధ్యక్షురాలు కొం తం స్వరూప శ్రీనివాస్‌లు మాట్లాడుతూ ఆకాల కడగండ్ల వర్షం తో నష్టపోయిన రైతులకు కడగండ్లు మాత్రమే మిగిలాయని, చేతికి అందివచ్చిన పంట నష్టంతో దిక్కుతోచని స్థితిలో రైతులు ఉన్నారన్నారు. ఇప్పటికే వర్షాకాలం పంట లేక, ఇప్పుడు అధిక పెట్టుబడులతో సాగు చేసిన రైతులకు ప్రకృతి సహకరించక పో వడం బాధాకరమన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటికే రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరలేదని, ఉన్నా కమి షన్ కటింగ్లతో సతమతమవుతున్నారన్నారు.ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
నష్టపోయిన మొక్కజొన్న, పొగాకు రైతులు
బయ్యారం : రెక్కలు ముక్కలు చేసుకొని ఎన్నో ఆశలతో అ రుగాలం కష్టించి పండించిన పంటల పై వరుణదేవుడు రైతన్నల ఆశల పై నీళ్లు చల్లాడు. పంట పండించి అమ్ముకోవడానికి సిద్దం గా ఉన్న రైతుకు వరుణ దేవుడు నిరాశ కలిగించాడు. ఒక్క సారిగా వచ్చిన ఈదురు గాలులతో కూడిన భారీ వర్షానికి కల్లాల లో, రోడ్లపై ఆరబెట్టిన మొక్కజొన్న ధాన్యం పూర్తిగా తడిసి ము ద్దయింది. సాగులో, కళ్ళల్లో ఉన్న పొగాకు పంటకి తీవ్ర నష్టం వాటిల్లింది. ఆదివారం తెల్లవారుజామున మండలంలో అకాల వర్షం కారణంగా మొక్కజొన్న, మిర్చి, మామిడి తోటల రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంట చేతికి వచ్చిందని సంబర పడే లోపు అనుకోకుండా కురిసిన వర్షానికి నష్టపోయిన పంటలను చూసి అన్నదాతలు ఏమి చేయాలో పలుపోవడం లేదని ఆవేదన చెందుతున్నారు. ఈదురుగాలులతో రోడ్ల పై భారీ చెట్లు రహదా రికి అడ్డంగా పడడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
అకాల వర్షం... అపార నష్టం...
చిన్నగూడూరు : మండలంలోని పగిడిపల్లి గ్రామం బాబోజీ తండా రైతులు తుఫాన్ ప్రభావంతో మిర్చి దగ్గరకు చేర్చి టార్పీ లీన్, పట్టాలు కప్పారు. శనివారం రాత్రి ఈదురుగాలులతో సు మారుగా రెండు గంటలు పాటు వడగాలులతో వర్షం పడింది. మిర్చి కల్లాల చుట్టూ నీళ్లు నిలిచాయి. మిర్చి పై పట్టాలు ఎంత కప్పినప్పటికీ మిర్చి తడిసి ముద్దయిందిదని రైతులు ఆందోళన చెందుతున్నారు. మరో రెండు రోజుల పాటు వర్షం ఉందని వా తావరణ శాఖాధికారులు పేర్కొంటున్నారని రైతులు మరింత ఆందోళన చెందుతున్నారు.
పిడుగు పడి 5 గొర్రెలు మృతి
జఫర్గడ్ : మండలంలోని కూనూరు గ్రామంలో శనివారం సాయంత్రం రాత్రి ఉరుముల మెరుపులతో భారీ వర్షకురస్తూ పిడుగు పడి కూనూరు గ్రామానికి చెందిన ముక్కెర కొమురయ్య, సురయ్య, కొమురయ్య, నాగరాజు, ఆగేయ్యలకు సంబంధించిన గొర్రెలు రోజువారీగా వ్యవసాయ బావి వద్ద గొర్రెల మందను ఉం చారు. గొర్ల కాపరులు అక్కడే కాపలాగా ఉన్నారు. వెంటనే అప్ర మత్తమై మీగుత గొర్రెలను కాపోడుకోగలిగారు. చనిపోయిన గొ ర్రెలకు నష్టపరిహారం చెల్లించాలని వారు కోరారు.
వానలకు నష్టపోతున్న రైతులు...
బచ్చన్నపేట : గత రెండు రోజులుగా రాత్రిపూట కురుస్తున్న వర్షాలకు మండలంలోని రైతులు తీవ్ర నష్ట పాలయ్యారు. శుక్ర, శనివారం రాత్రి కురిసిన వర్షాలకు మండలంలోని మామిడి తోటలలోని మామిడికాయలు పూర్తిగా రాలిపోయి తీవ్ర నష్టానికి గురయ్యారు.మండలంలోని పోచన్నపేట, చిన్నరాంచెర్లలతో పాటు వివిధ గ్రామాలలో రైతుల పంటలు కూడా నష్టపోయిన ట్లు తెలిసింది. వ్యవసాయ అధికారులు పంట నష్టాన్ని పరిశీ లించి నష్టపరిహారం అందే విధంగా చూడాలని రైతులు కోరారు.
అకాల వర్షానికి దెబ్బతిన్న పంటలు
స్టేషన్‌ఘన్‌పూర్ : మండలంలో అకాల వర్షానికి కోమటి గూడెం, బోయిని గూడెం, ఇప్పగూడెం, సముద్రాల, చిల్పూర్ మండలం మల్కాపూర్ గ్రామంలో ఇండ్లు దెబ్బతిన్నాయి. కొండా పూర్, కొమ్ముగుట్ట, శ్రీపతిపల్లి, తదితర గ్రామాల్లో ప్రధానంగా మొక్కజొన్న, వరి పంట నష్టం జరిగింది. రాత్రి కురిసిన వడ గండ్ల వానకు వరి పంట వడ్లు రాలాయి. మొక్కజొన్న పంట నేల వాలాయి. వరి, మొక్క జొన్న, మిర్చి కలిపి ఘన్పూర్ మండలం లో 174 ఎకరాలు, చిల్పూర్ మండలంలో 207 అన్ని గ్రామాల్లో వరి, మొక్కజొన్న దెబ్బతిన్నాయని మండల వ్యవసాయాధికారి చంద్రన్ కుమార్ తెలిపారు.
నేల రాలిన పంటలకు నష్టపరిహారం చెల్లించాలి : సీపీఎం
అకాల వర్షం కారణంగా నేలరాలిన పంటలకు నష్టపరిహా రం చెల్లించాలని సీపీఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు, వెంకటాద్రి పేట ఎంపీటీసీ ఎన్నకూస కుమార్ డిమాండ్ చేశారు. నిన్నటి అకాల వర్షం కారణంగా ఘన్పూర్,చిల్పూర్ మండలంలోని అన్ని గ్రామాల్లో వరి, మొక్కజొన్న, మిర్చిపంటలు దెబ్బతిన్నాయన్నారు. వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నష్టపోయిన పంటలను గుర్తించి ఎకరానికి 50వేల రూపాయలు నష్టపరిహా రం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
వరి పైరును పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి
కొడకండ్ల :కొడకండ్ల మండలంలో శనివారం రాత్రి ఈదురు గాలులతో ఉరుములు మెరుపులతో రాళ్ల వర్షం కురిసి వరి పం టకు భారీ నష్టం వాటిల్లింది. ఆదివారం పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండలంలోని రంగాపురం గ్రామంలో దెబ్బతిన్న వరి పంటను జిల్లా కలెక్టర్ శివలింగయ్య తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అకాల వర్షానికి రైతులు వేసిన వరి పంటతో పాటు మామిడి, మొక్కజొన్న, మిర్చితోపాటు అన్ని రకాల పంటలకు నష్టం జరిగిం దని అధికారులతో సర్వే చేయించి రైతులకు న్యాయం చేసేందు కు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో కృష్ణవేణి, రెవెన్యూ అధికారులుతో పాటు రంగాపురం సర్పంచ్ వల్లూరి సైదులు తదితరులు పాల్గొన్నారు.
ఈదురు గాలులతో కురిసిన భారీ వర్షానికి ఇల్లు నేల మ ట్టం కాగా ఏడున్నద్దుల రంగాపురం, రామవరం గ్రామాల్లో ఇండ్ల పై ఉన్న రేకులు లేచిపోగా ఇంట్లో ఉన్న సామాగ్రి అంత తడిసి ముద్దవ్వడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈదు రు గాలులకు రోడ్లపై ఉన్న పెద్ద పెద్ద వృక్షాలు విరిగి రోడ్లపై పడడంతో పాటు గ్రామాల్లో పెద్దపెద్ద చెట్లు విరిగి పడడంతో కొన్ని ఇండ్లు పూర్తిగా నేలమట్టమైనాయి. అధికారులు గ్రామాల వారీగా సర్వేలు నిర్వహించి నష్టపోయిన కుటుంబాలకు ఆర్థిక సాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాలకు చెం దిన సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులనుకోరారు. మండలం పూర్తిగా 24 గంటల పాటు అంధకారంలో మగ్గిపోయింది.
వడగండ్ల వానతో రూ 1.5 కోట్ల పంట నష్టం
పెద్దవంగర : అన్నదాతల ఆశలు నేలరాలాయి. కోటి ఆశల తో ఆరుగాలం కష్టించి పండించిన పంట అకాల వడగండ్ల వాన కు నీళ్ల పాలయింది. పాలకులు అలసత్వం ప్రదర్శించినా.. ప్రకృ తి ఆగ్రహించినా రైతన్నే బలవుతున్నాడు. ఎన్నో కష్టనష్టాలకోర్చి సాగు చేసిన పంటలు చేతికందే సమయంలో అకాల వర్షం రైతు లకు భారీ నష్టం చేకూర్చింది. మండల వ్యాప్తంగా శనివారం రాత్రి కురిసిన అకాల వడగండ్ల వానకు రైతాంగం పంటలను తీవ్రంగా నష్టపోయింది. గ్రామాల్లో ఈదురుగాలులు, అకాల వర్షానికి పంటలు వేలాది ఎకరాల్లో నేలరాలి, చేతికి అందకుండా పోయాయి. కోతకు సిద్ధంగా ఉన్న పంటలు వరి, మిర్చి, మొక్క జొన్న, పొద్దు తిరుగుడు పూర్తిగా దెబ్బతిన్నాయి. కూరగాయల తోటలు, మామిడి కాయలు నేలకొరగడంతో అన్నదాతలు కన్నీరు మున్నీరవుతున్నారు. వడ్డెకొత్తపల్లి, పెద్దవంగర, కొరిపెల్లి, గ్రా మాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు, ఇంటి పై కప్పులు నేలకూ లాయి. పోచారం గ్రామంలో పాడి గేదె మృతి చెందింది. కాగా మండలంలో 2,725 ఎకరాల్లో పంట అకాల వర్షానికి ధ్వంసం అయినట్లు వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. పంట న ష్టం సుమారుగా రూ 1.5 కోట్లు సంభవించినట్లు అధికారులు నిర్ధారించారు. 1,055 మంది రైతులను నష్టపరిహారం కోసం గుర్తించినట్లు అధికారులు తెలిపారు. మండలంలోని చిట్యాల, బొమ్మకల్, రెడ్డికుంట తండాల్లో కలెక్టర్ శశాంక పర్యటించి, పంట నష్టాన్ని పరిశీలించారు. కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ అధికారి ఛత్రు నాయక్, మండల వ్యవసాయ అధికారి కుమార్ యాదవ్, బీఆర్ఎస్ నాయకులు శ్రీరామ్ సుధీర్, శ్రీరామ్ సంజరు కుమా ర్, బానోత్ రవీందర్ నాయక్, రైతులు ఉన్నారు.
ప్రభుత్వం ఆదుకొని నష్టపరిహారం అందించాలి
తొర్రూర్ రూరల్ : తొర్రూర్ మండలంలో అరిపిరాల, మడి పల్లి, మాటేడు, ఫతేపురం ,చీకటాయపాలెం, ఖానాపురం, అమర్ సింగ్ తండా మొత్తం 19 గ్రామాలలో మొక్కజొన్న పంట1500 ఎకరాలలో, వరి పంట 2500 ఎకరాలలో, మిర్చి పంట 290 ఎకరాలలో, సుమారు 2000 మంది రైతుల పంట 5820 ఎకరాలలో పంట తీవ్రంగా నష్టపోయిందని మండల వ్యవసాయ అధికారి కుమార్ యాదవ్ తెలిపారు. అలాగే మామిడి రైతు కూ డా తీవ్రంగా నష్టపోయి మండల వ్యాప్తంగా 8 గ్రామాలలో 225 మంది రైతుల1025 ఎకరాలలో మామిడి పంట తీవ్రంగా నష్ట పోయి మామిడికాయలు రాలే అని మండల ఉద్యానవన శాఖ అధికారి రాకేష్ తెలిపారు. అలాగే పుచ్చతోట 25 ఎకరాలలో తీ వ్ర నష్టం జరిగిందని అధికారులు తెలిపారు. ప్రభుత్వం ఇప్ప టికైనా స్పందించి అధికారుల ద్వారా నివేదికలు తెప్పించుకొని రైతులను ఆదుకోవాలని మండల వ్యాప్తంగా రైతులు కోరారు.
వడగండ్ల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
తొర్రూరు మండలంలో అకాల వర్షాలు, వడగండ్ల వర్షాల కారణంగా పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వం స్పందించి రైతులకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవా లని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఒద్దిరాజు రాంచందర్ రావు కోరారు. ఆదివారం మండలం లోని మాటేడు,హరిపిరాల గ్రామాల్లో అకా ల వర్షాలు వడగండ్ల వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలను పరిశీలిం చి రైతులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ అకాల వర్షాల వల్ల వరి, మొక్కజొన్న,మిరప, మామిడి రై తులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు.ఆరుగాలం కష్టించి పని చేసిన రైతులకు అకాల వర్షాలు తీవ్ర నష్టం చేశాయని అధి కారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి నష్టపరిహారం అంచనా వేసి ప్రభుత్వానికి నివేదికలు పంపి త్వరగా రైతులకు నష్టపరిహారం అందేలా కృషి చేయాలని కోరారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించే విధంగా రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు నియోజకవర్గ ఇన్చార్జి పెదగాని సోమయ్య, రాష్ట్ర నాయకులు పాకనాటి దామోదర్ రెడ్డి, జనగామ జిల్లా ప్రధాన కార్యదర్శి కర్ర శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ తొర్రూరు శాఖ అధ్యక్షుడు పల్లె కుమార్, బీజేపీ పాలకుర్తి నియోజకవర్గ కన్వీనర్ పూసాల శ్రీమాన్, రాయ పురం రాజకుమార్,వడ్లకొండ రవి, బాగాల నవీన్ రెడ్డి, గడ్డం నరేందర్, నూకల నవీన్, పెండ్యాల గణేష్ పాల్గొన్నారు.
అకాల వర్షం... రైతన్నకు శాపం...
కొత్తగూడ : మండలంలోని పలు గ్రామాల్లో ఈదురు గాలు లతో కూడిన వర్షం కురవగా, గోపాలపురం, కార్లాయి, బత్తుల పెల్లి గ్రామాలలో వడగండ్ల వాన కురవడంతో భారీ వృక్షాలు, కరెంట్ స్తంబాలు విరిగిపడటంతో ప్రజలు భయాందోళనకు గుర య్యారు. ఈవర్షాల వల్ల చేతికోచ్చిన మొక్కజొన్న పంట నేల వాలి పోయాయి.కొత్తగూడ నుండి గూడూరు వెళ్లే మార్గంలో రోడ్డుకు అడ్డంగా కరెంట్ స్తంభం విరిగి పడటంతో రాకపోకలు నిలిచిపో యాయి.అంతేకాకుండా లక్నెపల్లి వద్ద, పాకాల సమీపంలో చెట్లు విరిగిపడటంతో 24 గంటలకు పైగా విద్యుత్ అంతరాయం కల గడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నష్టపోయిన రైతు లను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
రైతులను ఆదుకుంటాం : ఎమ్మెల్యే రాజయ్య
స్టేషన్‌ఘన్‌పూర్ : అకాల వర్షాల కారణంగా పంట నష్ట పోయిన రైతులను ఆదుకుంటామని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్య అన్నారు.ఆదివారం చిల్పూర్ మండలంశ్రీపతిపల్లి, కొం డాపూర్, లింగంపల్లి, మల్కాపూర్, నిన్న కురిసిన భారీ వర్షప్ర భావం వలన దెబ్బతిన్న పంట పొలాలను ఎమ్మెల్యే క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. పంట నష్టపోయిన రైతులందరినీ ప్రభుత్వ పరం గా న్యాయం జరిగే విధంగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని అన్నా రు. పంట నష్టాన్ని అంచనా వేసి నివేదిక అందజేయాలని అధికా రులను ఎమ్మెల్యే ఆదేశించారు. భారీవర్షాలు కురుస్తున్న నేపథ్యం లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గుజ్జరి రాజు, తహశీల్దార్ విమల, ఏఓ చంద్రన్ కుమార్, నియోజకవర్గ కో ఆర్డినేటర్ కేశిరెడ్డి మనోజ్ రెడ్డి, మం డల ఇంచార్జీ పోలేపల్లి రంజిత్ రెడ్డి, ప్రసాద్, అశోక్, ఏఈఓ, తదితరులు పాల్గొన్నారు.
పాలకుర్తిలో 334 ఎకరాల్లో పంట నష్టం
పాలకుర్తి : పాలకుర్తి మండలంలో శనివారం రాత్రి ఆది వారం తెల్లవారుజామున ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షంతో పాటు వీచిన ఈదురు గాలులకు పంటలు నేలమట్టమ య్యాయి. పాలకుర్తి మండలంలో 13 గ్రామాల్లోని 128 మంది రైతులకు చెందిన వివిధ రకాల పంటలు భారీ వర్షానికి, ఈదురు గాలులకు నేలమట్టమయ్యాయి. ఈదురు గాలులకు, భారీ వర్షా నికి 334 ఎకరాల్లో పంటలు నష్టపోయాయని పాలకుర్తి వ్యవ సాయ శాఖ ఉపసంచాలకులు అజ్మీర పరశురాం నాయక్ తెలిపా రు. 120 ఎకరాల్లో వరి పంట, 144 ఎకరాల్లో మొక్కజొన్న పం ట, 20 ఎకరాల్లో మిర్చి, 50 ఎకరాల్లో మామిడి పంటలకు నష్టం వాటిల్లిందని, ప్రాథమిక అంచనా నిమిత్తం సర్వే నిర్వహించి నివేదికను కలెక్టర్‌కు అందజేశామని తెలిపారు.
గుడిపై చెట్టు పడి రైతు మృతి
గూడూరు : మండలంలోని చిన్న ఎల్లాపురం గ్రామపంచా యతీకి చెందిన రైతు ధరావత్ శంకర్ (43) శనివారం రాత్రి ఉరుముల మెరుపులతో కూడిన వర్షానికి చెట్టుపై పిడుగు పడిన ఘటనలో గుడి కూలిపోవడంతో అక్కడకక్కడే మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ధరావత్ శంకర్, జై ఏరియా ఇద్దరు కలిసి తన మొక్కజొన్న సేను కు శనివారం రాత్రి వెళ్లారు. అర్ధరాత్రి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం రావడంతో సేద తీర్చేందుకు పక్కనే ఉన్న గుడి వద్దకు వెళ్లారు. గుడి వద్దకు వెళ్లిన క్రమంలో చెట్టు పైన పిడుగుపాటు పడడంతో గుడి కూలిపోతుంది శంకర్ అక్కడి కక్కడే మృతి చెందగా ఏరియాకు రెండు కాళ్లు విరిగిపోయాయి. సమాచారం తెలుసుకున్న తండావాసులు అక్కడికి చేరుకొని ఏరి యాలో చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రెెక్కడి తేగానే డొక్క నిండని రైతు కుటుంబానికి చెందిన శంకర్ మృతి చెందడంతో కుటుంబం దుక్క సాగరంలో మునిగింది. తక్షణమే వారి కుటుంబానికి ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని గిరి జనులు డిమాండ్ చేస్తున్నారు. మృతుడికి భార్య పిల్లలు ఉన్నా రు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే
గూడూరు : పిడుగుపాటుతో గుడి కింద రైతు శంకర మృతి చెందిన సంఘటన తెలియగానే మహబూబాబాద్ ఎమ్మెల్యే బా నోత్ శంకర్ నాయక్ చిన్నలాపురం చేరుకుని సంఘటన వివరా లు తెలుసుకొని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపా రు. 5వేల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందన్నారు.కాళ్లు విరిగిన ఏరియా ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. శంకర్ కుటుంబానికి నష్టపరిహారం అందించేలా చూస్తానని అన్నారు. ఎమ్మెల్యే వెంట మండల పార్టీ అధ్యక్షులు వేం వెంకటకష్ణారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి నూకల సురేందర్, కార్యకర్తలు పాల్గొన్నారు.
అధైర్య పడొద్దు... అండగా ఉంటా : మంత్రి ఎర్రబెల్లి
పెద్దవంగర : అకాల వర్షానికి పంట నష్టపోయిన రైతులు అధైర్యపడవద్దు... ప్రభుత్వంతోపాటు, తాను అన్నదాతలకు అం డగా ఉంటానని... నష్టపోయిన పంట వివరాలను అంచనా వే స్తున్నాం, పంట నష్ట వివరాల నివేదిక తయారు చేసి ప్రభుత్వా నికి పంపుతాం... నష్టపోయిన రైతులందరినీ ఆదుకునేందుకు కృషి చేస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రైతులకు హామీ ఇచ్చారు. పంట నష్టం వివరాలు తెలుసుకోవడానికి మంత్రి ఎర్ర బెల్లి మండలంలోని చిట్యాల, బొమ్మకల్, రెడ్డికుంట తండా, రామ చంద్రు తండా, పోచారం, వడ్డెకొత్తపల్లి, అమర్ సింగ్ తండాల్లో మంత్రి ఎర్రబెల్లి జిల్లా కలెక్టర్ శశాంకతో కలిసి పర్యటించారు. రైతులతో మాట్లాడి, పంటల నష్టం వివరాలను అడిగి తెలుసుకు న్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నష్టపోయిన రైతు ల వివరాలను క్షేత్రస్థాయిలో సేకరించాలని అధికారులను ఆదే శించారు. రైతులెవరూ అధైర్యపదవద్దని, ప్రభుత్వంతోపాటు తా ను అన్నదాతలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. వ్యవ సాయ అధికారులు నష్టపోయిన పంట వివరాలను గ్రామాల వారీగా సేకరిస్తున్నారని చెప్పారు. అధికారులు వివరాల సేకరణ పూర్తయిన అనంతరం నివేదికను ప్రభుత్వానికి పంపించి రైతు లకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చా రు. అవసరమైతే సీఎంతోపాటు వ్యవసాయ శాఖ మంత్రితో తా నే స్వయంగా మాట్లాడి రైతులకు న్యాయం జరిగేలా చూస్తానని ఎమ్మెల్యే భరోసా కల్పించారు. కాగా మండలంలో కురిసిన అకాల వర్షానికి అపార నష్టం వాటిల్లింది. వడ్డెకొత్తపల్లి, పెద్దవంగర, కొరిపెల్లి, గ్రామాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు, ఇంటి పై కప్పులు నేలకూలాయి. పోచారం గ్రామంలో పాడి గేదె మృతి చెందింది. కాగా మండలంలో 2,725 ఎకరాల్లో పంట అకాల వర్షానికి ధ్వం సం అయినట్లు వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. పంట నష్టం సుమారుగా రూ 1.5 కోట్లు సంభవించినట్లు అధికారులు నిర్ధారించారు. 1,055 మంది రైతులను నష్టపరిహారం కోసం గుర్తించినట్లు అధికారులు తెలిపారు. మంత్రి వెంట జిల్లా వ్యవ సాయ అధికారి ఛత్రు నాయక్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య, నెహ్రూ నాయక్, శ్రీరామ్ సుధీర్, శ్రీరామ్ సం జరు కుమార్, సోమ నరసింహారెడ్డి, ముత్తినేని శ్రీనివాస్, పాల కుర్తి యాదగిరిరావు, ఈదునూరి శ్రీనివాస్, బానోత్ రవీందర్ నాయక్, రావుల శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
పంట నష్టం పై క్షేత్ర పరిశీలన :
మండల వ్యవసాయ అధికారి నేలకుర్తి రవీందర్ రెడ్డి
నెల్లికుదురు : మండలంలోని వివిధ గ్రామాలలో వ్యవసా య అధికారులు పంట నష్టం పై క్షేత్ర పరిశీలన చేసినట్లు మండ ల వ్యవసాయ అధికారి నెలకుర్తి రవీందర్ రెడ్డి రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ తెలిపారు. మండలంలోని వివిధ గ్రామాలలో వరి పంట మొక్కజొన్న, మిరపపంటలపై సర్వే ఆది వారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లికుదురు, చిన్నముప్పారం, ఆలేరు, మునిగలవీడు, వివిధ గ్రా మాలలో క్షేత్ర పరిశీలన చేసి పంట నష్టం వివరాలు సేకరించ డం జరిగిందని తెలిపారు. మండలంలోని సుమారు మొక్కజొ న్న పంట 15 ఎకరాలపై పైనే నష్టం జరగవచ్చునని, అంచనా లు వేస్తున్నామని తెలిపారు. మండలంలో ఎక్కువ మొత్తంలో మొక్కజొన్న పంట నష్టం జరిగిందని తెలిపారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు వడగండ్ల వర్షానికి రాళ్లకు పంట నష్టం జరిగిందని తెలపగానే వారి పంట చేన్ల వద్దకు వెళ్లి పరిశీలిస్తున్నమన్నారు. నివేదికను పై అధికారులకు పంపిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలం రైతు బంధు సమన్వయ కర్త వెంకటేశ్వర రెడ్డి,ఏఈవోలు ముజాహిద్ ప్రవీణ్ ప్రతిభా శిరీష రైతులు తదితరులు పాల్గొన్నారు.
వర్షాలకు నేలకొరిగిన ఇల్లు : బాధితురాలు సుగుణమ్మ
నెల్లికుదురు : రాత్రి అకాల వడగండ్ల వర్షం రాళ్ల వర్షం కు రిసి మండలంలోని మదనతోర్తి గ్రామంలో ఇద్దరి ఇల్లు దెబ్బ తి న్నాయని బాధితురాలు కుక్క సుగుణమ్మ నర్సయ్యలు తెలిపారు. ప్రభుత్వమే ఆదుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ మండలంలోని మదంతుర్తి గ్రామానికి చెందిన కుక్క సుగుణమ్మను, వడ్లకొండ నరసయ్యలకు డబల్ బెడ్ రూమ్ ఇం డ్లు ఇచ్చి అదుకోవాలని కోరుతున్నారు.