Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వందలాది ఎకరాలో పంట నష్టం
నవతెలంగాణ-ములుగు
అకాల వడగండ్ల వైశాలతో ములుగు జిల్లాలో వందలాది ఎకరాల మిర్చి, మొక్కజొన్నతోపాటు అపరాల పంటలు నష్టపోయి రైతులు లబోదిబో మంటూ కంటతడి పెట్టారు. శనివారం రాత్రి ములుగు జిల్లాలో భారీ వర్షాలు కురిసాయి. దీంతో ములుగు, వెంకటాపూర్, గోవింద రావుపేట్, ఏటూరు నాగారం, కన్నాయిగూడెం, మంగపేట, వెంకటాపురం, వాజేడు మండలాల్లో భారీ వర్షాలకు చేతికి వచ్చిన పంట వరదల్లో మునిగిపోవడంతో రైతులు కంటి ముందు నష్టపోవడంతో లబోదిబో మంటున్నారు. లక్షల వ్యయంతో సొంత భూములు, కౌలు భూములు పంటలు వేసిన రైతులు చేతికొచ్చే సమయంలో అకాల వర్షంతో పంట నష్టపోవడం దిగమింగలేక పోతున్నారు. లక్షల రూపాయలు ఎవరు షాపుల్లో ఖాతాలు పెట్టి, ఇతరుల వద్ద అప్పు లు చేసి పంట నమ్ముకుని అప్పులు తీసుకుందాం అనే సమయంలో వర్షాలతో పంట నష్టపోవడంతో ఏమి చేయాలో తెలియని దశలో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ములుగు జిల్లాలో వర్షపాత నమోదు ఇలా ఉన్నాయి. జిల్లాలోని వెంకటాపూర్ మండ లంలో 61.06 మిల్లీమీటర్ నమోదు, ములుగు 54. 02, గోవిందరావుపేట్ 69 04,తాడ్వాయి 82.00, ఏటూర్ నాగారం 50.02, వాజేడు 13.08, వెంకటాపురం 102.02, మంగపేట్ 70.00, కన్నాయిగూడెం 28.04, జిల్లాలో మొత్తం 531.08 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.