Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పట్టించుకోని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
- ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం
నవతెలంగాణ -హన్మకొండ
కేంద్ర ప్రభుత్వం కాకతీయ చారిత్రక సంపదక అయిన వేయి స్తంభాల గుడిపై నిర్లక్ష్యంగా వ్యవ హరిస్తుందని ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినరు భస్కర్ ఆరోపించారు. ఆదివారం బీఆర్ఎస్ ప్రాతిని ధులతో కలిసి వేయి స్తంభాల దేవాలయాన్ని సంద ర్శించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆ యన మాట్లాడారు. రాష్ట్రానికి చెందిన కిషన్‌రెడ్డి కేంద్ర పర్యాటక మంత్రిగా ఉన్న వరంగల్‌లోని వెయ్యి స్తంభాల గుడి పునర్నిర్మాణం ముందుకు సాగడం లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం చిన్నచూపుతో 17 ఏండ్లుగా వెయ్యి స్తంభాల గుడి పునరుద్ధరణ పనులు ముందుకు సాగడం లేదన్నారు. గుడి పర్యవేక్షణ కేంద్ర పురావస్తుశాఖ పరిధిలోనే ఉంటుందని అన్నారు. ఈ నిర్మాణంతోపాటు సమీప ప్రాంతం లోనూ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి పనులు చేసేందుకు అనుమతి ఉండదని అన్నారు. ఆలయం, మండం పునరుద్ధరణ కోసం 2006లో రూ.3.50 కోట్లను కేంద్రం మంజూరు చేసిందని 2009లోపు పనులు పూర్తి చేయాల్సి ఉండగా 2010 ఫిబ్రవరి 3న పనులు మొదలయ్యాయని అన్నారు. వీటిని ఎంపిక చేసిన స్తపతికి అప్పగించిందని అన్నారు. దీంతో కళ్యాణ మండపంలోని రాతి నిర్మాణాలను ఒక్కొక్క టిగా తొలగించారని అప్పటికే 132 పిల్లర్లను, 160 బీములు విరిగిపోయి ఉండడంతో వీటి స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేయాల్సిన అవసరం వచ్చిం దన్నారు. పనులు ఆలస్యం కావడంతో 2012లో పనుల అంచనా విలువ రూ.7.50 కోట్లకు పెరిగిం దని అన్నారు. నిధులు రాక పనులు మధ్యలోనే నిలి పేశారన్నారు. 2018లో నిధులు విడుదల చేయగా గతంలో చేసిన పనులకు చెల్లించారన్నారు. ఇంకా పెండింగ్ పనులను పూర్తి చేసేందుకు మరో రూ.6 కోట్లు అవసరమవుతాయని అంచనా వేసినా కేంద్రం స్పందించడంలేదని అన్నారు. దీంతో పునర్నిర్మాణ పనులు ముందుకు సాగలేదన్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఆలయం ఆవరణ బయట మౌలిక వసతులు కల్పించిందన్నారు. రూ.20 కోట్లతో వెయ్యి స్తంభాల గుడి ప్రధాన ద్వారం పూర్తి చేసిందని అన్నారు. ఆలయం ప్రధాన ద్వారం ముందు కోటి రూపాయతో బ్యూటిఫికేషన్, పార్కింగ్ ఏర్పాట్లు చేసిందని అన్నారు. మంత్రి కిషన్‌రెడ్డి రాజకీయా లకు తప్ప అభివృద్ధికి పనికిరాడని అర్థమైందన్నారు. ఈ కార్యక్రమంలో కుడా చైర్మన్ సుందర్ రాజు యాదవ్, ఆలయ ప్రధాన పూజారి గంగు ఉపేంద్ర శర్మ, బి ఆర్ ఎస్ నాయకులు పులి రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు.