Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తాడ్వాయి/గోవిందరావుపేట /ములుగు
ములుగు జిల్లా తాడ్వాయి, గోవిందరావుపేట ఏజెన్సీ మండలాల్లో నీ మొండాలతోగు, జలగలంచ, ప్రాజెక్టు నగర్ గొత్తికోయగూడెంలో ఆదివారం రాష్ట్ర రెడ్ కో చైర్మన్ సతీష్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ పోరిక గోవింద నాయక్, ములుగు జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ బడే నాగజ్యోతి, ములుగు జిల్లా ఎస్పీ గౌస్ ఆలం, ఓఎస్డి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో 40 కుటుంబాల వారికి 500 సోలార్ లైట్లు పంపిణీ చేశారు. గొత్తి కోయల మంచి చెడులు, వారి భౌగోళిక పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. గుత్తి కోయ పిల్లలకు బిస్కెట్ పాకెట్ లను పంపించేశారు. గూడాలను కాలినడక ద్వారా తిరిగి, వారి పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గొత్తి కాయగూడాలలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో రాత్రి సమయంలో ఇబ్బందులు పడుతున్నం దున వారి కుటుంబాలకు సోలార్ ఎల్ఈడి లైట్లు పంపిణీ చేశామని తెలిపారు. వారకి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా ఆలోచిస్తున్నట్లు తెలిపారు. రాబో యే రోజుల్లో వారి పిల్లల చదువులు, తాగునీరు కరెంటు రవాణా తదితర మౌలిక సదుపాయాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు. అనంతరం పస్రా పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. స్టేషన్లో విద్యుత్‌తో నడుస్తున్న ఫ్యాన్లకు బదులు సోలార్‌తో నడిచే ఫ్యాన్లను అమరుస్తామని తెలిపారు. ఇంతకు ముందు సంస్థ తరుపున స్టేషన్ ఆవరణలో అమర్చిన ఫ్యాన్లను పరిశీలించారు. జిల్లా పరిధి పోలీస్ స్టేషన్లలో సోలార్ పరికరాలు అమరుస్తామని, జాబితాను సిద్ధం చేసి పంపాలని జిల్లా ఎస్పీ గౌస్ అలంకు సూచించారు. జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బడే నాగ జ్యోతి, ఎంపీపీ సూడి శ్రీనివాసరెడ్డి, సానికొమ్ము దిలీప్ రెడ్డి, గోవిందరావుపేట ఎంపీపీ సూడి శ్రీనివాస్ రెడ్డి, పస్రా సీఐ శంకర్, స్థానిక ఎస్సై వెంకటేశ్వరరావు,అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.