Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ ఎన్జీవోస్ కాలనీ
వడ్డెపల్లి ముదిరాజ్ వీధీకి చెందిన బలుసుకురి కొమురయ్య పెంకుటిల్లు ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ తో దగ్ధం అయింది. సమాచారం అందుకున్న రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్ భాస్కర్ ఆదివారం హుటా హుటిగా అక్కడికి అధికార బృందంతో చేరుకొని వారికి భరోసా కల్పించారు. వీలైనంత త్వరగా ప్రభుత్వం నుండి అందాల్సిన సహాయాన్ని అందించే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చి ఆర్థిక సాయం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఇమ్మడి లోహిత రాజు, మాజీ కార్పొరేటర్ కేశబోయిన అరుణశ్రవణ్ కుమార్, బీఅర్ఎస్ నాయకులు మట్టపల్లి రమేష్, సమ్మయ్య, డివిజన్ అధ్యక్షులు రామరాజు, ఆటో యూనియన్ నాయకులు బలుసుకురి రవీందర్ మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులు, సుబేదారి పోలీస్ సిఐ సుకుర్, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.