Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ధర్మసాగర్
టీిఎస్పీఎస్సీ ప్రశ్న పత్రాల లీకులకు నైతిక భాద్యత వహించి వెంటనే కేటీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన దిష్టి బొమ్మను ధర్మసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం దహనం చేసారు. ఈ సందర్బంగా మండల పార్టీ అధ్యక్షులు గుఱ్ఱపు ప్రసాద్ మాట్లాడుతూ ప్రశ్న పత్రాల లీకుల వల్ల అర్హులైన నిరుద్యోగులకు అన్యా యం జరిగిందని అన్నారు. వారు కొన్ని సంవత్సరాల నుండి కోచింగ్ సెంటర్లకు ఫీజ్ లు కట్టి పరీక్షలకు సిద్ధం కావడం జరిగిందన్నారు. ప్రశ్నాపత్రాలు లీకులు కావడంతో వారు ఆందోళనలకు గురయ్యార న్నారు. ఈ కుట్రలో బీఆర్ఎస్ నాయకుల పాత్ర, బీజేపీ నాయకుల పాత్ర ఉందని అన్నారు. సిబిఐ ద్వారా న్యాయ విచారణ జరిపించాలని, లేదంటే సిట్టింగ్ జెడ్జి తో విచారణ జరపాలని డిమాండ్ చేసారు. మొదట టీఎస్పీఎస్సీ ఛైర్మెన్ జనార్దన్ రెడ్డిని విధుల నుండి తప్పించి బాధ్యులైన వారిపై విచారణ జరుపాలని కోరారు. ఎంపీటీసీ జాలిగాపు వనమాల-సారయ్య, పీఏసీఎస్ డైరెక్టర్ బొడ్డు లెనిన్, గ్రామశాఖ అధ్యక్షులు జాలిగాపు దుర్గయ్య, మండల మహిళా అధ్యక్షురాలు ఠాకూర్ ఉమా, జిల్లా నాయకురాళ్లు అంకం రాజకుమారి, జాలిగాపు లక్ష్మి, కొమురమ్మ, గ్రామశాఖ కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.