Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారుల సర్వే నివేదికలు రాగానే పరిహారం అందిస్తాం
- రైతులకు భరోసానిచ్చిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
నవతెలంగాణ- తొర్రూర్ రూరల్
ఇది రైతు ప్రభుత్వమని, సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి అని, రైతుల కోసం దేశంలో ఎక్కడా లేనన్ని అభివద్ధి, సంక్షేమ పథకాలను రూపొందించి అమలు చేస్తున్న ప్రభుత్వం అని, వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. బుధవారం ఉగాది పండుగ రోజు అని చూడకుండా నష్టపోయిన రైతుల పంటలను పరిశీలించారు. మండలంలోని హరిపిరాల కర్కాల గ్రామాల్లో నష్టపోయిన పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి దయాకర్‌రావు మాట్లాడుతూ రైతులు నష్టపోకుండా చివరకు పంటలు కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. ఇలాంటి ప్రభుత్వం, ఈ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న సీఎం కేసీఆర్ తప్పకుండా పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లిస్తారన్నారు. రైతులు ఎట్టి పరిస్థితుల్లో అధైర్య పడాల్సిన పనిలేదు. వారికి అండగా ప్రభుత్వం ఉంటుంది. మేమంతా అన్నదాతలకు అండగా ఉంటాంమని పంటలు దెబ్బతిన్న రైతులకు నష్టపరిహారం చెల్లిస్తామన్నాని అన్నదాతకు భరోసానిచ్చారు. తీవ్రంగా పంట నష్టపోయిన ప్రాంతాలను పరిశీలిస్తున్న సందర్భంలో ఆయా రైతులను మంత్రి పరామర్శించి ఓదార్చారు. మంత్రిని చూసిన రైతులు బోరుమన్నారు. తమకు పరిహారం ఇప్పించాలని తీరని, తీవ్ర నష్టాలలో కూరుకుపోయిన తమకు అండగా నిలిచి ఆదుకోవాలని వారు విలపించారు. ఈ సందర్భంగా మంత్రి వారికి భరోసానిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకుంటుందని అన్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ ప్రజా ప్రతినిధులను పంట నష్టాలను పరిశీలించాలని ఆదేశించారని, ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటూ తమతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉన్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉద్యానవన శాఖ అధికారి సూర్యనారాయణ, ఎంపీపీ తూర్పాటి చిన్న అంజయ్య, జడ్పీ ఫ్లోర్ లీడర్ మంగళపల్లి శ్రీనివాస్, ఆర్డిఓ రమేష్, తాసిల్దార్ నాగేంద్రర పసాద్ ,ఎంపీటీసీ వల్ల గోపమ్మ మల్లయ్య, మండల కో ఆప్షన్ నెంబర్ అంకుష్, అధికారులు నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు.