Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏప్రిల్ 3న చలో ఢిల్లీ తెలంగాణ మత్స్య కారులు,
మత్స్య కార్మిక సంఘం(టీఎంకేఎంకేఎస్)
జిల్లా ప్రధాన కార్యదర్శి గొడుగు వెంకట్
నవతెలంగాణ-ఎన్జీవోస్ కాలనీ
కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులో మత్స్యకారు లపై చూపుతున్న వివక్షను నిరసిస్తూ, దేశవ్యాప్త మత్స్య కారుల సమస్యలపై ఏప్రిల్ 3న చలో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద భారీ ఎత్తున మత్స్యకారుల మహా ధర్నా నిర్వహి స్తుందని, జిల్లా నుండి మత్స్య కారులు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గోడుగు వెంకట్ పిలుపునిచ్చారు. బుధవారం హన్మకొండ రామ్నగర్ లోని టీఎంకేఎంకేఎస్ జిల్లా కార్యా లయంలో జిల్లా అధ్యక్షులు నిమ్మల విజేందర్ ముదిరాజ్ అధ్యక్షతన జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో వెంకట్ మా ట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బడ్జెట్లో మత్స్య కారులకు లక్ష కోట్లు కేటాయించకుండా విఫలమైంద న్నారు. దేశవ్యాప్తంగా మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలపై పట్టించుకోకుండా కార్పొరేట్లకు అన్ని రంగాలలో అవకాశాలు కల్పిస్తూ అనేక రాయితీలు ఇస్తూ పేదలకు ఇచ్చే సబ్సిడీలను రద్దుచేసి ప్రజలపై భారాలను మోపుతున్నదని అన్నారు. ఫలితంగా మత్స్యకారులు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. దేశవ్యాప్తంగా మత్య వత్తిపై ఆధారపడి ప్రత్యక్షంగా మూడు కోట్ల మంది మత్స్యకారులు ఉపాధి పొందుతు న్నారన్నారు. దేశానికి కోట్లాది రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని మత్స్య సంపద ఎగుమతుల ద్వారా సంపాదిస్తున్న మత్స్యకారులకు 2023 బడ్జెట్లో కేవలం రూ.6వేల కోట్లు మాత్రమే కోటాయించడం అన్యాయమని అన్నారు. దేశవ్యా ప్తంగా మత్స్య పరిశ్రమ అభివద్ధి మత్స్యకారుల సంక్షేమానికి లక్ష కోట్లు కేటాయించాలని అన్నారు. 50 సంవత్సారాలు నిండిన మత్స్యకారులకు పింఛన్ ఇవ్వాలని అన్నారు. ఎన్సీడీసీ ద్వారా మత్స్యకారులకు మోటార్ సైకిళ్ళు, చేపల మార్కెట్లు నిర్మించాలని కోరారు. వత్తి ప్రమాదంలో మర ణించిన పేదరికంతో వైద్యం చేయించుకోలేక సహజంగా మరణించిన మత్స్యకారులకు దేశవ్యాప్తంగా ఇన్సూరెన్స్, ఎక్స్ గ్రేషియో పాలసీ ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో టీఎంకేఎంకేఎస్ జిల్లా నాయకులు నీల మల్లయ్య, బొజ్జం స్వామి, పిట్టల రవి, నీలం మల్లయ్య, పవన్, లత, అరుణ, శ్రీలత, హిమబిందు, కుమార్ తదితరులు పాల్గొన్నారు.