Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకట్రెడ్డి
నవతెలంగాణ-గోవిందరావుపేట
వడగండ్ల వానతో నష్టపోయిన రైతుల్ని ప్రభుత్వమే ఆదుకోవాలని సీపీఐ(ఎం) ములుగు జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి అన్నారు. బుధవారం మండలం లోని గుండ్ల వాగు ప్రాజెక్టు కింద గత ఆదివారం రాత్రి కురిసిన వడగండ్ల వానకు గాలి దుమారానికి మండలంలోని సుమారు 200 ఎకరాల మామిడి తోట , వందలాది ఎకరాల వరి పైరు, మిర్చి దెబ్బతిన్నాయి. బుధవారం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో గుండవాగు ప్రాజెక్టు కింద నష్టపోయిన రైతుల పంట పొలాలు, మామిడి తోట పరిశీలించాఉరు. ఈ సందర్భంగా తుమ్మల వెంకటరెడ్డి మాట్లాడారు. గత ఆది వారం పడిన వడగండ్ల వానకు భూక్య మీటునాయక్ అనే రైతు మామిడి తోట చెట్లతో సహా కూలిపోయి కాయ కూడా మిగలలేదన్నారు. వరి కూడా వడగండ్లకు పచ్చి వడ్లు రాలిపోయినాయని పేర్కొన్నారు. అప్పటికే ఎకరాకు వరికి రూ.20,000, మిర్చికి లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి పంట చేతికొచ్చే సమయానికి రైతులు అకాల వర్షంతో వడగండ్లవానతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు పర్యటించి నామమాత్రపు పరిశీలన చేపట్టారని అన్నారు. గుండ్ల వాగు ప్రాజెక్టు కింద ప్రతి రైతు పంట వ్యవసాయ శాఖ అధికారులు హార్టికల్చర్ అధికారులు పరిశీలించి ప్రభుత్వానికి నివేదికలు పంపాలని అన్నారు. లేదంటే భవిష్యత్తులో రైతుల సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి తీగల ఆదిరెడ్డి, పొదిళ్ల చిట్టిబాబు,గుండు రామస్వామి, సామ చంద్రారెడ్డి, భూక్య మిట్నాయక్, పాలిత్య బాలు, మూడు రాజునాయక్, మాలోత్ గాంధీ, అజ్మీర కొమ్మాలు, అజ్మీర దుర్గ, భూక్య మార్క్ తదితరులు పాల్గొన్నారు .