Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు
నవతెలంగాణ-మల్హర్రావు
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అన్ని వర్గాల ప్రజలను అభివృద్ధి చేస్తామని కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి, కర్ణాటక రాష్ట్ర ఇంచార్జి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీదర్ బాబు అన్నారు. కర్ణాటక రాష్ట్రంలోని బెల్గాంలో సిపిఈడి మైదానంలో జాతీయ కాంగ్రెస్ అగ్ర, యువనేత రాహుల్ గాంధీ 'యువ క్రాంతి ర్యాలీ' సదస్సు బుధవారం జరిగింది. ఈ సందర్బంగా దుద్ధిళ్ల శ్రీధర్‌బాబు హాజరై ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు రూ.2 లక్షల ఋణమాపి,అడబిడ్డలకు రూ.500కే వంటగ్యాస్, ఇందిరమ్మ ఇంటికి రూ.5 లక్షల సాయం, ఇంట్లో ఇద్దరు వద్ధులు ఉంటే వారికి రూ.5వేల పిన్సన్, మొదటి ఏడాది 2లక్షల ఉద్యోగాలు, స్వశక్తి మహిళలకు పావలా వడ్డీలకే రుణాలు, అమ్మహస్తం కింద రేషన్ దుకాణాల ద్వారా రూ.185కే నాణ్యమైన 9 నిత్యావసర సరుకులు అందిజేస్తామని తెలిపారు.